Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సర్కార్ కు భారీ షాక్-ఏపీ జెన్ కో దివాళా-నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చిన కేంద్రం-ఢిల్లీకి పరుగు

ఏపీలో వైసీపీ సర్కార్ కు కేంద్రం భారీ షాకిచ్చింది. ఇప్పటికే సంక్షేమం పేరుతో భారీ ఎత్తున అప్పులు తెచ్చిమరీ ఖర్చులు చేస్తూ అభివృద్ధిని అటకెక్కించిన సర్కార్.. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్ధలకు కేంద్రం నుంచి తెచ్చిన అప్పుల్ని కూడా సకాలంలో తీర్చలేని పరిస్ధితికి వచ్చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీ జెన్ కో ను నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరుస్తూ నిర్ణం సంచలన తీసుకుంది. దీని తర్వాత నిర్ణయం ప్రైవేటీకరణే కావడంతో అలా జరగకుండా కేంద్రంతో లాబీయింగ్ చేసేందుకు అధికారులు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు.

 జగన్ సర్కార్ అప్పులు

జగన్ సర్కార్ అప్పులు

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పుల భారం పెరుగుతూనే పోతోంది. గతంలో టీడీపీ సర్కార్ హయాంలో అప్పులపై నానా యాగీ చేసిన వైసీపీ.. తాము అధికారంలోకి వచ్చేసరికి రెట్టింపు అప్పులు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు కూడా పెట్టేస్తోంది. అయినా ఆర్ధిక అవసరాలు తీరడం లేదు. ఇదే క్రమంలో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మక సంస్ధల్ని సైతం దివాలా తీయించే స్ధాయికి తీసుకెళ్లిపోతున్నాయి. దీంతో ఇప్పుడు వాటి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది.

ఏపీ జెన్ కో దివాళా

ఏపీ జెన్ కో దివాళా

ఏపీలో విద్యుత్ ఉత్పత్తి కార్పోరేషన్ (జెన్ కో) కేంద్ర ప్రభుత్వానికి చెందిన గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ నుంచి గతంలో అప్పులు తీసుకుంది. వాటిని సకాలంలో చెల్లించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఏపీ సర్కార్ ఉన్న పరిస్దితుల్లో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే పరిస్దితి లేదు. దీంతో మూడు నెలలుగా గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ కు అప్పులు చెల్లించడం లేదు. పలుమార్లు గుర్తు చేసినా పట్టించుకోని పరిస్ధితి. ఆర్ధికంగా వెసులుబాటు లేకపోవడంతో ఈ దుస్ధితి నెలకొంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారంపై కేంద్రం కన్నెర్ర చేస్తోంది.

 జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాక్

జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాక్

గతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు ఇలా సకాలంలో చెల్లించకపోయినా కేంద్రం పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. రాష్ట్రాలు సకాలంలో తీసుకున్న అప్పులు చెల్లించకపోతే వాటిపై కొరడా ఝళిపించడం మొదలుపెట్టేస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీ జెన్ కోపై కేంద్రం కొరడా ఝళిపిస్తోంది. గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ నుంచి తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించని కారణంగా ఏపీ జెన్ కో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడుతోంది.

నిరర్ధక ఆస్తుల జాబితాలో ఏపీ జెన్ కో

నిరర్ధక ఆస్తుల జాబితాలో ఏపీ జెన్ కో

ఏపీ జెన్ కో కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ నుంచి తీసుకున్న అప్పుల వాయిదాల గడువు దాటిపోయింది. ఆ తర్వాత మరో 90 రోజులు కూడా అయిపోయింది. అయినా జెన్ కో స్పందించకపోవడంతో కేంద్రం ఇక చేసేది లేక దీన్ని నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జెన్ కో కు కొత్తగా అప్పులు పుట్టవు. జెన్ కో కు ఉన్న పరపతి తగ్గిపోతుంది. డిఫాల్టర్ గా మారిన జెన్ కో పై కేంద్రం ఏ క్షణాన ఏ చర్య అయినా తీసుకునే అధికారం దఖలు పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించి ఈ జాబితాలో నుంచి తొలగించాలని కోరాల్సి ఉంటుంది.

ఢిల్లీకి అధికారుల పరుగులు

ఢిల్లీకి అధికారుల పరుగులు

కేంద్ర ప్రభుత్వం జెన్ కో ను నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేర్చారన్న విషయం తెలిగానే అధికారులు వేగంగా స్పందించారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రం వద్ద లాబీయింగ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్ర విద్యుత్ ఆర్ధిక సంస్ధతో పాటు గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ నుంచి ఏపీ ప్రభుత్వం రూ.9 వేల కోట్ల రుణాలు తీసుకుంది. వీటిని చెల్లించేస్తామని కేంద్రానికి వివరించబోతున్నారు. అలాగే తెలంగాణ నుంచి తమకు రావాల్సిన రూ.5 వేల కోట్లు ఇప్పించాలని కేంద్రాన్ని జెన్ కో అధికారులు కోరబోతున్నారు. అలాగే జెన్ కో ఆర్ధిక పరిస్ధితిని కూడా కేంద్రానికి వీరు వివరించబోతున్నారు.

Recommended Video

    RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Oneindia Telugu
    వైజాగ్ స్టీల్ తరహాలోనే జెన్ కో ప్రైవేటీకరణ?

    వైజాగ్ స్టీల్ తరహాలోనే జెన్ కో ప్రైవేటీకరణ?

    ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధల్ని ఒక్కొక్కటిగా నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేర్చి ప్రైవేటీకరణ చేపడుతోంది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధలతో పాటు కేంద్రానికి బకాయిలు పేరుకుపోయిన వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ సంస్ధల్నీ ప్రైవేటీకరిస్తోంది. తద్వారా ఇరువురికీ ప్రయోజనం కలిగేలా చేస్తోంది.

    తాజాగా ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకునే పరిస్ధితుల్లో లేదు. ఇప్పుడు జెన్ కో కూడా నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరడంతో అదే విధంగా ప్రైవేటీకరణ చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+