Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్- పీడీ యాక్ట్ బోర్డుపై -విపక్షాలకు ఊరట-మోడీ బాటలోనే ?

ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకున్న మరో కీలక నిర్ణయానికి హైకోర్టు చెక్ పెట్టింది. రాష్ట్రంలో విపక్షాలను టార్గెట్ చేసేందుకు వీలుగా పీడీ యాక్ట్ పై నమోదైన కేసుల సమీక్షా మండలిని తమకు నచ్చినట్లుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అడ్వైజరీ బోర్డులో ఛైర్మన్ తో పాటు ఇద్దరు సభ్యులు ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. అదే సమయంలో ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన మూడు పీడీ యాక్ట్ ఉత్తర్వుల్ని సైతం హైకోర్టు రద్దు చేసింది. దీంతో పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డుపై జగన్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

 ప్రివెన్టివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం

ప్రివెన్టివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం

సీఆర్పీసీలోని సెక్షన్ 151 ప్రకారం మన దేశంలో ఏ వ్యక్తి అయినా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడతాడని అనుమానం వచ్చినప్పుడు సదరు వ్యక్తిని ముందస్తుగా నిర్భంధించేందుకు వీలుగా పీడీ యాక్ట్ ను అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా చోట్ల పరిస్ధితుల ఆధారంగా సొంత నిబంధనలతో ఈ చట్టాల్ని అమల్లోకి తీసుకొచ్చాయి. తమ రాష్ట్రాల్లో పరిస్దితుల ఆధారంగా వ్యక్తులపై, ఇప్పటి కాలంలో అయితే విపక్షాలపై ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నాయి. దీంతో నేరస్తుల్ని కట్టడి చేయడానికి అమల్లోకి తెచ్చిన చట్టం కాస్తా విపక్షాల్ని టార్గెట్ చేసేందుకు ఉపయోగపడుతోంది.

 పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు

పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు

పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి ముందస్తుగా వ్యక్తుల్ని నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు ఈ వ్యవహారాన్ని సమీక్షించేందుకు అడ్వైజరీ బోర్డు ( సమీక్షా మండలి) ఉంటుంది. పీడీ యాక్ట్ కింద నిర్బంధించిన వ్యక్తులు అప్పీలు చేసుకునేందుకు ఈ బోర్డు ఉపయోగపడుతుంది. ఇది సదరు వ్యక్తుల్ని పోలీసులు ముందస్తుగా నిర్బంధించడానికి తగిన కారణాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తుంది. చట్ట విరుద్ధంగా సదరు వ్యక్తుల్ని నిర్బంధించినట్లు గుర్తిస్తే వారిని విడుదల చేసేలా ఉత్తర్వులు ఇస్తుంది. అలా కాకపోతే మాత్రం పోలీసులు, మెజిస్ట్రేట్ లు జారీ చేసిన ఉత్తర్వుల్ని సమర్ధిస్తుంది. అంటే చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందా లేదా అన్నది సమీక్షించే అధికారం ఈ అడ్వైజరీ బోర్డుకు ఉంటుంది.

 ఏపీ పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు వివాదం

ఏపీ పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు వివాదం

ఏపీలో పీడీ యాక్ట్ కింద నమోదైన కేసులపై అప్పీల్ చేసుకునేందుకు అడ్వైజరీ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇందులో ఛైర్మన్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు ఉండాలని పీడీ చట్టం చెబుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఛైర్మన్ తో పాటు ఓ సభ్యుడితోనే బోర్డు ఏర్పాటు చేయడం వివాదాస్పమైంది. ఇలా ఛైర్మన్ తో పాటు ఓ సభ్యుడితో ఏర్పాటు చేసిన బోర్డు తాజాగా కడప జిల్లా కలెక్టర్ ముగ్గురిపై ప్రయోగించిన పీడీ యాక్ట్ ను సమర్ధించడం మరో వివాదానికి దారి తీసింది. కలెక్టర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వుల ఆధారంగా అడ్వైజరీ బోర్డు వాటిని సమర్ధించగా.. ప్రభుత్వం జీవోలు ఇచ్చేసింది. కానీ హైకోర్టు మాత్రం వీటిని తప్పుబట్టింది.

 సర్కార్ కు హైకోర్టు షాక్

సర్కార్ కు హైకోర్టు షాక్

పీడీ చట్టం ప్రకారం అడ్వైజరీ బోర్డులో ఛైర్మన్ తో పాటు మరో సభ్యుడిని మాత్రమే ఉంచడాన్ని హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. కడప జిల్లాలో కలెక్టర్ పీడీ యాక్ట్ ప్రయోగించిన ముగ్గురు వ్యక్తుల భార్యలు హైకోర్టును ఆశ్రయించారు. తమ భర్తలపై పీడీ యాక్ట్ ప్రయోగం చెల్లదని వాదించారు. దీంతో హైకోర్టు ఈ ఉత్తర్వుల్ని రద్దు చేసింది. అదే సమయంలో ఛైర్మన్, ఓ సభ్యుడితోనే పీడీ యాక్ట్ సమీక్షా బోర్డు ఏర్పాటు కూడా చెల్లదని స్పష్టం చేసింది. నెల రోజుల్లో ఛైర్మన్, ఇద్దరు సభ్యులతో బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులతో పాటు అడ్వైజరీ బోర్డు ఏర్పాటులోనూ లోపాలు ఉన్నందున సర్కార్ కు భారీ షాక్ తగిలింది.

 విపక్షాలపై ప్రయోగించేందుకేనా ?

విపక్షాలపై ప్రయోగించేందుకేనా ?

పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డును తమకు అనుకూలమైన ఇద్దరు సభ్యులతోనే ఏర్పాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో తాము జారీ చేసే పీడీ యాక్ట్ ఉత్తర్వుల సమీక్షను కూడా ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో చట్టపరమైన నిబంధనల్ని పాటించకపోవడంతో హైకోర్టు కూడా దీన్ని ఆక్షేపించింది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్షాలపై పలు కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం.. పీడీ యాక్ట్ ను వాడుకుని వారిని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకే అడ్వైజరీ బోర్డును సైతం తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Recommended Video

    AP Cabinet Writes To krishna River Board On Srisailam Power Issue Targeting TS Genco|Oneindia Telugu
     మోడీ సర్కార్ బాటలోనే జగన్ ?

    మోడీ సర్కార్ బాటలోనే జగన్ ?

    దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక యూఏపీఏ (చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణ చట్టం) ను విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్ధులతో పాటు గిట్టని వారిపై దీన్ని వాడుతున్నారు. ఇప్పుడు ఏపీలోనూ జగన్ సర్కార్ విపక్షాల్ని టార్గెట్ చేసేందుకే పీడీ యాక్ట్ కు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డును కూడా తమకు అనుకూలంగా ఉండే వారితో నింపుకునేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓసారి ఈ అడ్వైజరీ బోర్డు ఏర్పాటైతే ఆ తర్వాత తమ ప్రభుత్వం ప్రయోగించే పీడీ యాక్ట్ కేసులకు ఇక ఎదురే ఉండదని సర్కార్ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే ఇప్పటికే నల్ల చట్టాల విషయంలో న్యాయస్ధానాలు పదే పదే మొట్టికాయలు వేస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ఇంకా వీటిపైనే ఆధారపడుతుండటం విశేషం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+