శ్రీశైలం అడవిలో దాడి కేసులో ట్విస్ట్..! పవన్ కు పోలీసుల షాక్..!
శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి అటవీ సిబ్బందిపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అటవీ సిబ్బందిని బంధించి కార్లలో తిప్పుతూ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని అటవీ సిబ్బంది కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో పాటు సాక్ష్యాలు కూడా విడుదల చేశారు. దీంతో డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బుడ్డాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు పెట్టాలని ఆదేశించారు.
అయితే ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఏ2గా మాత్రమే పెట్టి జనసేన నేత అశోక్ రౌత్ ను మాత్రం ఏ1గా పెట్టి కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేను తప్పించేందుకే ఈ కేసులో ఏ2గా పెట్టారని, తమ పార్టీకి చెందిన నాయకుడిని ఏ1గా పెట్టారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. అలాగే వీరిద్దరిపైనా బెయిలబుల్ కేసులే పెట్టడం మరో విశేషం.

శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి తమను బంధించి కొట్టడంపై అటవీ శాఖ అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశారు. ఇచ్చారు. అలాగే నిన్న కేబినెట్ భేటీకి ముందు మంత్రి లోకేష్, కేబినెట్లో సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తెల్లారే సరికి సీన్ మారిపోయింది. జనసేన నేత అశోక్ రౌత్ ను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

సీసీ ఫుటేజ్ లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నా ఆయన్ను ఏ2గా పెట్టడం, జనసేన నేతను ఏ1గా పెట్టడం ఏంటన్న చర్చ జరుగుతోంది. అలాగే వీరిద్దరిపైనా బెయిల్ లభించేలా కేసు పెట్టడంపైనా విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై మౌనం వహిస్తోంది.












Click it and Unblock the Notifications