వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకా కేసులో కీలక పరిణామం-తెరపైకి టీడీపీ ఎమ్మెల్సీ ? ఏ5 భార్య వాంగ్మూలంతో !

|
Google Oneindia TeluguNews

పులివెందుల : ఏపీలో మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ ఒత్తిడి నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఆలస్యమవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది. సీబీఐ ఈ కేసులో నిందితుడిగా చేర్చిన వ్యక్తి భార్య పులివెందుల కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలే ఇందుకు కారణం.

 వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్

వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్

2019లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకూ ఈ వ్యవహారం వెళ్లింది. ఈ దశలో కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇవాళ వైఎస్సార్ జిల్లా పులివెందుల కోర్టులో చోటు చేసుకున్న ఈ పరిణామం దీనికి కారణంగా నిలిచింది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశాలూ లేకపోలేదు.

ఏ5 దేవిరెడ్డి భార్య వాంగ్మూలం

ఏ5 దేవిరెడ్డి భార్య వాంగ్మూలం


వైఎస్ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా మారింది. ఆయన ప్రోద్భలంతోనే ఈ హత్య చోటు చేసుకుందని సీబీఐ నమ్ముతోంది. ఆయన వెనుక ఎవరున్నారనే విషయం కాస్త పక్కనబెడితే వివేకా హత్య ఘటన ఆద్యంతం శివశంకర్ రెడ్డి పేరే వినిపించింది. దీంతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆయన బెయిల్ కూ కోర్టులు నిరాకరించిన పరిస్ధితి. ఈ నేపథ్యంలో దేవిరెడ్డి భార్య తులసమ్మ ఈ కేసులో తన భర్త పాత్ర లేదని, మరికొందరిని విచారిస్తే ఈ విషయం బయటపడుతుందంటూ ఫిబ్రవరిలో పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ ఆరుగురిని సీబీఐ విచారిస్తే ?

ఆ ఆరుగురిని సీబీఐ విచారిస్తే ?

వైఎస్ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడు దేవిరెడ్డి భార్య తులసమ్మ ఫిబ్రవరిలో పులివెందుల కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ వాంగ్మూలం ఇచ్చారు. పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ముందు ఈ వాంగ్మూలం నమోదు చేశారు. ఇందులో ఆమె వివేకా కేసులో మరో ఆరుగురిని సీబీఐ విచారించాలని కోరారు. ఇందులో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన బావమరిది శివ ప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌ లను విచారించాల్సిందిగా కోరారు. ఈ మేరకు సీబీఐకి ఆదేశాలివ్వాలంటూ ఆమె పులివెందుల కోర్టును కోరారు. దీనిపై కోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

English summary
in another twist in former minister ys vivekananada reddy murder case, a5 devireddy shivasankar reddy's wife tusalamma has given key statement in pulivendula court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X