ఊర మాస్ లుక్కు.. అదే అసలు కిక్కు
అమరావతి: అక్కినేని అందగాడు నాగార్జున నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. నా సామిరంగ. కోరియోగ్రాఫర్ విజయ్ బెన్నీ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ కింద శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఆఫీసర్, మన్మథుడు 2, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్..వరుస డిజాస్టర్లు. బంగార్రాజు ఒక్కటే హిట్ అయింది. దాని తరువాత వచ్చిన ఘోస్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియని పరిస్థితి. ఓ మాస్ ఎంటర్‌టైనర్ కోసం నాగార్జున అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తూ వస్తోన్నారు.

అలాంటి మూవీనే నా సామిరంగ. నాగ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటింగ్ గ్లింప్సెస్‌ను రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. విలన్ అండ్ గ్యాంగ్స్‌తో తలపడే సన్నివేశాన్ని గ్లింప్సెస్‌గా కట్ చేశారు. ఇందులో మాస్ లుక్స్‌తో మెరిశాడు నాగార్జున. అడ్డపంచె, బీడీతో రగ్డ్‌గా కనిపించాడు. ఓ మంచి మాస్ మూవీ పడినట్టే.
ఇంట్రడక్షన్ సీన్‌లో నాగార్జున బీడీని వెలిగించుకోవడం డిబేట్స్‌కు తెర తీసింది. ఈ మధ్యకాలంలో టాప్ హీరోలందరూ మాస్ మంత్రాన్ని జపిస్తోన్నారనడానికి ఇదో పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి ఇదే లుక్‌తో సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత దసరా సినిమాతో నాని గెటప్ కూడా ఇదే.
గుంటూరు కారంలో మహేష్ బాబు సైతం ఊర మాస్ లుక్స్‌తో అదరగొట్టాడు. గుంటూరు కారం టైటిల్ గ్లింప్సెస్‌లోనూ బీడీతో కనిపించాడు. మహేష్ బర్త్‌డే కానుకగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్‌లో లుంగీతో మెరిశాడు. ఇప్పుడు నాగార్జున కూడా అదే సక్సెస్ మంత్రాన్ని జరిపిస్తోన్నాడు. బీడీ-లుంగీతో మాస్ మెసేజ్ ఇచ్చాడు.
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా!











Click it and Unblock the Notifications