స్నాచర్లకు చేదు: బైక్‌తో గుద్దిన యువకుడు, రూ.5వేల రివార్డ్, చిన్నారిపై రేప్
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లాలో చైన్ స్నాచర్లకు చేదు అనుభవం ఎదురయింది.త ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నం చేయగా... ఆమె అరిచింది. దీంతో, ఆక్కడే ఉన్న ఓ యువకుడు ఆమె అరుపులు విని దొంగలను అడ్డుకున్నారు.
అనంతపురంలోని మారుతీ నగర్లో ద్విచక్ర వాహనం పైన వచ్చిన దొంగలు మహిళ మెడలో గొలుసు లాక్కునే ప్రయత్నం చేశారు. ఆమె అరవడంతో.. ఎదురుగా మరో బైక్ పైన వచ్చిన యువకుడు వారి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో చైన్ స్నాచర్స్ కిందపడిపోయారు.

వెంటనే అక్కడకు స్థానికులు చేరుకున్నారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. ఓ చైన్ స్నాచర్‌కు తీవ్ర గాయమైంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమనోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, చైన్ స్నాచర్లను అడ్డుకున్న యువకుడికి పోలీసులు రూ.5వేల రివార్డ్ ప్రకటించారు. అలాగే, అతని ద్విచక్ర వాహనానికి మరమ్మతులు చేయించాలని డిఎస్పీ పోలీసులను ఆదేశించారు.
చిన్నారిపై అత్యాచారం
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. సింగన్నవలస గ్రామంలో ఐదేళ్ల చిన్నారి పైన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాలికను ఆసుపత్రికి తరలించారు.
అనూష ఆత్మహత్యపై కేసు దర్యాఫ్తు ముమ్మరం
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బిటెక్ విద్యార్థిని అనూష ఆత్మహత్య కేసులో పోలీసులు కళాశాల కరస్పాండెట్, హెచ్ఓడీని పోలీసులు అరెస్టు చేశారు.
హెచ్ఓడీ మాలకొండా రెడ్డి అందరిముందు అనూషను వేధించేవాడని, అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. అనూష తన డైరీలోను ఆయన పేరు రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో, పోలీసులు అతనితో పాటు కరస్పాండెంటును అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12వ తేదీన అనూష తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications