జగన్ పై దాడి: పురందేశ్వరి తాజా డిమాండ్ - సరిదిద్దుకున్న నాగబాబు..!!

ఎన్నికల సమయంలో జగన్ పై దాడి కలకలంగా మారింది. జగన్ పైన జరిగిన దాడిని పలువురు ఖండించారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఇదంతా డ్రామా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ దాడి వెనుక టీడీపీ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. దాడి ఘటన పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. జనసేన నేత నాగబాబు దాడి తరువాత చేసిన ట్వీట్ పైన వైసీపీ నేతలు సీరియస్ గా స్పందించారు. తాజాగా నాగబాబు దాడిని ఖండిస్తూ మరో ట్వీట్ చేసారు.

రాజకీయ దమారం
జగన్ పైన జరిగిన దాడి పైన రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ ఈ దాడి పైన స్పందించారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల దాడి తరువాత చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. షర్మిల చేసిన ట్వీట్ పైన వైసీపీ నేతలు మండిపడ్డారు. దాడి జరిగితే స్పందించాల్సిన తీరు పైన నిలదీసారు. ఇక, టీడీపీ మద్దతు దారులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం పైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి జగన్ పైన జరిగిన దాడి హేయమైన చర్యగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు.

BJP AP Chief Purandeswari and Nagababu condemned attack on YS Jagan at Vijayawada

చర్యలు తీసుకోవాలి
ఈ సంఘటన పై లోతైన దర్యాప్తు జరిపి సంఘటన కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పురందేశ్వరి కోరారు. మాజీ మంత్రి కేటీఆర్ సీఎం జగన్‎పై రాళ్ల దాడి జరగడాన్ని ఖండించారు. సీఎం జగన్ క్షేమంగా ఉన్నందుకు సంతోషం అన్నారు. దీనిపై ఈసీ చర్యలు చేపట్టాలన్నారు.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని సూచించారు. రాజకీయ విబేధాలు దాడులకు దారితీయకుడదన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందింస్తూ.. సీఎం జగన్ పై దాడి విషయం విని షాక్ కు గురయ్యా అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఇలాంటి ఘటనలు జరగకూండా చర్యలు తీసుకోవాలన్నారు.

BJP AP Chief Purandeswari and Nagababu condemned attack on YS Jagan at Vijayawada

నాగబాబు స్పందన
ఇక..మెగా బ్రదర్ నాగబాబాబు ఘటన జరిగిన వెంటనే స్పందించారు. తన ఎక్స్ ఎకౌంట్ ద్వారా పరోక్షంగా చేసిన కామెంట్స్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నాగబాబు మరో ట్వీట్ చేసారు. అందులో జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అప్రజాస్వమిక చర్య, జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను,రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు కాని ఇలా భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్య చట్టరీత్యా నేరం, పోలీసు వారు ఈ దాడికి పాల్పడిన దుండగులకి కఠిన శిక్ష వేయాలని మరోమారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను... అంటూ నాగబాబు పోస్టు చేసారు. అటు ఘటన పైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+