వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లిని చంపిందన్నారుగా: మోడీపై జూపూడి, బాబుకు ఉమ భరోసా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు గురువారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపిందని ప్రధాని మోడీయే అన్నారని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు బిడ్డను చంపే ప్రయత్నం బిజెపి చేస్తోందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పైన నమ్మకం పోయిందన్నారు. ఏపీ పైన బీజేపీ కనీసం సవతి తల్లి ప్రేమ కూడా చూపించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కంటే ఘోరంగా మోసం చేయాలని బిజెపి భావిస్తోందా అని నిలదీశారు.

'మోడీ నిజాయితీ ఎక్కడ, వెంకయ్య ఏం చెప్తారు': అర్థం చేసుకోండి.. బాబు'మోడీ నిజాయితీ ఎక్కడ, వెంకయ్య ఏం చెప్తారు': అర్థం చేసుకోండి.. బాబు

ఏపీకి ప్రత్యేక హోదా పైన ప్రధాని మోడీయే స్వయంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి తన మేనిఫెస్టోను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ కోరుకున్నట్లుగానే జరగాలని బిజెపి భావిస్తోందా అన్నారు.

BJP behaving like stepmother on AP: Jupudi

తెలుగుదేశం, బిజెపి రాజీపడిందని వైసిపి ఆరోపిస్తున్నా తాము ఓపిక పడుతున్నామని చెప్పారు. ప్రజలకు, ఏపీకి అన్యాయం చేస్తే వారి పక్షాన టిడిపి తప్పకుండా పోరాడుతుందని చెప్పారు.

పోలవరం మేమే నిర్మిస్తాం: ఉమా భారతి

పోలవరం జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన ప్రాజెక్టు అని కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. పోలవరం నిర్మాణ ఖర్చును కేంద్రమే భరిస్తుందని చెప్పారు. ఒడిశా అభ్యంతరాల పైన ఆ రాష్ట్ర ఎంపీలతో చర్చించామని చెప్పారు. మరోసారి చర్చకు ఒడిశా ఎంపీలను ఆహ్వానించామన్నారు.

కేంద్రంపై చిరాకు: రెండున్నర గంటలు బస్సులోనే ఉండిపోయిన బాబుకేంద్రంపై చిరాకు: రెండున్నర గంటలు బస్సులోనే ఉండిపోయిన బాబు

కాగా, అంతకుముందు, అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ఏపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని, ఇప్పటి దాకా రూ.6,403 కోట్లు ఇచ్చామని, తొలి ఏడాది రెవెన్యూ లోటుగా రూ.2,800 కోట్లు ఇచ్చామని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని, విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉంటామని చెప్పిన విషయం తెలిసిందే.

6403 కోట్లు, 2800 తోలి ఏడాది రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టుసక నిధులు, విభజనచట్టంలోని అంశాలకు కట్టుబడి, ఏపీ ఆందోళన అవసరం లేదు, అడిగినదాని కంటే ఎక్కువ ఇచ్చాం, రెవెన్యూ లోటుపై అధ్యయనం చేస్తునాం, విభజించింది యూపీఏ.

English summary
TDP leader Jupudi Prabhakar Rao on Thursday said that BJP is behaving like stepmother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X