రుషికొండ భవనాల పై బీజేపీ ముఖ్య నేత బిగ్ ట్విస్ట్..!!
రుషికొండ భవనాల అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఈ వ్యవహారం తేల్చేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఆతిథ్య రంగం నుంచి ఇప్పటికే పలు ప్రతిపాదనలు అందాయి. ఈ భవనాల పైన అదనంగా నిర్మాణాలు చేయటం ద్వారా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. కాగా, ఈ భవనాల వినియోగం పైన తాజాగా బీజేపీ ముఖ్య నేత కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ ఉంచారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది.
రుషికొండ భవనాల సబ్ కమిటీ ఆలోచనలు చేసింది. ప్యాలెస్ నిర్మాణంలో కొన్ని మార్పులు చేసి, ఆతిథ్య రంగానికి కేటాయిస్తే బాగుంటుందనే ప్రతిపాదనకు మెజారిటీ మంత్రులు మొగ్గు చూపారు. అయితే, ఈ నెల 28న ఆన్‌లైన్‌లో భేటీ అయి అన్నిరకాల ప్రతిపాదనలపై మరోసారి చర్చించాల ని సబ్ కమిటీ నిర్ణయించింది. కాగా, బీచ్ ఫ్రంట్ వినియోగంపై కూడా కమిటీ సుదీర్ఘ చర్చించింది.

అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మాల్దీవులు, పుదుచ్చేరి తరహా విధానాలను అసుసరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వచ్చింది. 'రుషికొండ కింద ఉన్న తొమ్మిది ఎకరాలను హోటళ్ల కోసం అదనంగా కొంతమంది అడిగారని చెప్పిన మంత్రులు...అందులో ఏడు ఎకరాల్లో అదనపు భవనాలు, సదుపాయాలు కల్పించే వీలుందని వెల్లడించారు.
కాగా, ఈ భవనాల పైన కొత్త నిర్మాణాలు చేస్తే హోటళ్లకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రా యం వ్యక్తం అయింది. దీని పైన బీజేపీ శాసనసభా ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆరేళ్లుగా రుషికొండను మూసేసారని చెప్పారు. రుషికొండను కేవలం ఆదాయ వనరుగా చూడటం సరికాదన్నారు. రుషికొండ పైన ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. హోటళ్లకు కేటాయింటం అంటే సామాన్యులకు దూరం చేయటమేనని విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు.
ఈ విషయంలో విశాఖ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక సిటీగానూ ఉండాలని పేర్కొన్నారు. టీటీడీకి అనుబంధంగా రుషికొండ భవనాలను కేటాయించాలని.. ఆధ్యాత్మిక ఎగ్జిబిషన్ గా మార్పు చేయాలనేది సామాన్యుడి కోరిక గా వివరించారు. విశాఖ ఎంపీతో పాటుగా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. దీంతో.. ఇప్పుడు ఈ భవనాల వినియోగం పైన తాజాగా బీజేపీ నేత డిమాండ్ పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications