జగన్ హయాంలో టీటీడీలో వందల కోట్ల అక్రమాలు, పవన్ కల్యాణ్ తో మాట్లాడుతాం
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు మనవి చేశారు. ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అధికారం అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భానుప్రకాష్ రెడ్డి గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. గత వైసీపీ పాలనలో టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని, సీఎం హోదాలో వైఎస్ జగన్ కూడా టీటీడీ అక్రమాలు చూసిచూడనట్లు వ్యవహరించారని, వైసీపీ నాయకులు శ్రీవెంకటేశ్వర స్వామివారి డబ్బును దోచుకున్నారని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, వరప్రసాద్ ఆరోపించారు.

టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో భూమన కరుణాకర్ రెడ్డి వందల కోట్ల రూపాయలను లూటీ చేశారని, అధికారం అడ్డం పెట్టుకుని వందల కోట్లు వెనుక వేసుకున్నారని, అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పూర్తిగా సహకరించారని, దీనిపై న్యాయ విచారణ జరిపిస్తే అక్రమాలు అన్ని బయటకు వస్తామని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలపై న్యాయ విచారణ జరిపించలని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైసీపీ పాలనలో టీటీడీ అక్రమాలు, గంజాయి సరఫరా, ఎర్రచందనం తదితర అవకతవకలపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీలో ఎన్నడూ లేనివిధంగా అక్రమాలు, దౌర్జన్యాలు, ఉద్యోగుల మీద వేధింపులు ఎక్కువ అయ్యాయని, వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన అక్రమాలు విచారణ జరిపిస్తే అన్ని స్కామ్ లు బయటకు వస్తాయని భానుప్రకాష్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవి శాఖ బాధ్యతలు స్వీకరించారని, ఆయన్ను తాము కలిసి 5,380 టన్నుల ఎర్రచందనం నిల్వలపై విచారణ జరిపించాలని జనసేన అధినేతకు మనవి చేస్తామని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విదాలుగా ఆదుకోవడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications