నీ భవిష్యత్తేమిటో నువ్వు చూసుకో: పవన్ కల్యాణ్‌కు సిద్ధార్థనాథ్ సింగ్ కౌంటర్
న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు ఆయన భవిష్యత్తు చూసుకోవాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి భవిష్యత్తు లేదని పవన్ కల్యాణ్ కాకినాడ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. ఎన్డీఎలో ఉంటారా, లేదా అనేది పవన్ కల్యాణ్ ఇష్టమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాయం చేస్తుందని ఆయన చెప్పారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ నేతలతో కలిసి ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బొంబాయి రాష్ట్రం నుంచి విడిపోయే సమయంలో గుజరాత్ ఎపి కన్నా ఎక్కువగా వెనుకబడి ఉండేదని, కాని ఇప్పుడు దేశంలో అగ్రగామిగా నిలిచిందని మోడీ అన్నట్లు చెప్పారు.

పవన్ కల్యాణ్ తీరును ఆయన తప్పు పట్టారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. భావోద్వేగాలతో అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. పవన్ పాచిపోయిన లడ్డూలంటూ చేసిన వ్యాఖ్యపై ఆయన స్పందిస్తూ - నిధులు పాచిపోవని, మాటలే పాచిపోతాయని అన్నారు.
ఎపికి కేంద్రం అందించిన, అందిస్తున్న ప్రత్యేక సాయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని బిజెపి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు హరిబాబు అన్నారు. ఇందుకు తిరుపతి, విశాఖపట్నం, విజయవాడల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ సభలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరవుతారని ఆయన చెప్పారు ఏ రాష్ట్రానికి చేయని విధంగా కేంద్రం ఎపికి సాయం చేస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications