పులివెందులలో టీడీపీ విజయం వెనుక బీజేపీ ముఖ్య నేత..!!

ఏపీలో రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. జగన్ కంచుకోటలో టీడీపీ విజయం. కడప జిల్లాలో జరిగిన రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్ల టీడీపీ విజయం సాధించింది. ఈ ఎన్నిక షెడ్యూల్ వచ్చిన సమయం నుంచి టీడీపీ - వైసీపీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరా హోరీ ప్రచారం చేసాయి. ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ నాడే వైసీపీ శ్రేణులు పరాజయం ఖాయమని డిసైడ్ అయ్యాయి. చివరకు టీడీపీ గెలిచింది. అయితే, ఇక్కడ టీడీపీ విజయం వెనుక బీజేపీ ముఖ్య నేత కీలక పాత్ర పోషించారు.

టీడీపీ గెలుపుతో
జగన్ కంచుకోట పులివెందుల జెడ్పీటీసీ బై పోల్ లో టీడీపీ విజయం సాధించింది. మూడు దశాబ్దాల తరువాత అక్కడ టీడీపీ గెలుపొందింది. జగన్ నియోజకవర్గంలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ నేతలు పక్కా ప్రణాళిత్మకంగా.. వ్యూహాలు అమలు చేసారు. ప్రచారం ముగిసిన సమయం నుంచి పోలింగ్ చివరి నిమిషం వరకు ఎవరి బాధ్యతలు వారు పక్కాగా నిర్వహించారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. వైసీపీ ని డిపాజిట్ రాకుండా ఓడించాలనే లక్ష్యం నెరవేరింది. ఈ ఎన్నికలో టీడీపీకి 6735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి.

BJP leader plays key role in TDP victory in pulivedula ZPTC by poll details here

ఆదికి బాధ్యతలు
కాగా, పులివెందుల - ఒంటిమిట్ట ఎన్నికల బాధ్యతలను ఇద్దరు కీలక నేతలకు పార్టీ నాయకత్వం అప్పగించింది. ఒంటిమిట్ట బాధ్యతలను మంత్రి మందపల్లి రాం ప్రసాద్ కి కేటాయించారు. అదే విధంగా పులివెందుల బాధ్యతలను గతంలో జగన్ కుటుంబానికి సన్నిహితుడుగా.. తరువాత జగన్ పైన విరుచుకుపడటంలో ముందుండే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీసుకున్నారు. టీడీపీ నేతలు ఈ ఇద్దరికీ పూర్తిగా సహకరించారు. ఎన్నిక ముందు రోజునే పోలింగ్ సమయంలో ఏ రకం గా వ్యవహరించాలో స్కెచ్ సిద్దం చేసారు. పక్కాగా ప్రణాళిక అమలు చేసారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఏ స్థాయిలో ఆరోపణలు వచ్చినా.. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లారు. తమ రాజకీయ ప్రత్యర్థి జగన్ నియోజకవర్గంలోనే విజయం సాధించాలనే లక్ష్యాన్ని చేరుకున్నారు.

bjp-leader-plays-key-role-in-tdp-victory-in-pulivedula-zptc-by-poll-details-here

లెక్క పక్కా
ఆదినారాయణ రెడ్డి వరుసగా మూడు సార్లు జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పులివెందుల జెడ్సీటీసీ బై పోల్ అభ్యర్ధి ఎంపిక విషయం నుంచి బీటెక్ రవి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి తో పాటుగా పార్టీ జిల్లా అధ్యక్ష, ఇతర నేతలతో సమన్వయం చేసుకున్నారు. కుప్పం స్థానిక ఎన్నిక ల్లో వైసీపీ గెలిచి. .ఏ రకంగా ప్రచారం చేసిందో.. ఇప్పుడు తమకు అలాంటి అవకాశం రావటంతో.. వదులు కోకూడదని డిసైడ్ అయ్యారు. పోలింగ్ నాడు జమ్మలమడుగు ఓటర్లు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. జగన్ తో విభేదించి టీడీపీలో చేరి మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి 2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జగన్ పైన తన ఆగ్రహాన్ని ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తీర్చుకున్నారు. ఆదికి టీడీపీ నేతలు సహకరించారు. దీంతో, ఇప్పుడు ఇదే విషయంలో టీడీపీ కార్యాలయంలోనూ ప్రధాన చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+