ఉత్తరాంధ్ర డిమాండ్ వైసీపీదా ? ధర్మానదా ? బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న..
ఏపీలో అమరావతి రాజధాని అయితే ఉత్తరాంధ్రకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న డిమాండ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనిపై ఇవాళ ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మానకు సూటి ప్రశ్నలు వేశారు. మంత్రి ధర్మాన ప్రత్యేక రాష్ట్రం అడగడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారా..? అని అడిగారు. ఇది మీ ప్రభుత్వ నిర్ణయమా ధర్మనా అభిప్రాయమా అని నిలదీశారు. ధర్మాన అబిప్రాయం అయితే ధర్మానను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా అని వైసీపీ సర్కార్ ను కూడా విష్ణు ప్రశ్నించారు. ఉద్ధానానికి మీరు ఇచ్చిన హామీ నెరవేరిందా అని ధర్మానను విష్ణు ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రకు ఏం చేశారని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ధర్మానకు విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. జగన్న తోడు అనేది కేంద్ర ప్రభుత్వం పథకమని, 15 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 15 కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. మీ దోపిడీకి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతున్నారా అని అడిగారు. మీరు అభివృద్ధి చేస్తే వలసలు ఎందుకు జరుగుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా ఛార్జ్ షీట్ వేస్తామని హెచ్చరించారు.

వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్రంలో భూముల్ని 22ఏలోకి చేర్చి రైతులు అమ్మకోకుండా చేస్తున్నాయన్నారు.
22 ఏలో ఉన్న రైతు భూముల వెంటనే తొలగించాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదన్నారు.
అంశాల వారిగా విపక్షాలు కలవడం సాధారణంగా జరిగేదేనని, రాజకీయ అంశంగా ముడి పెట్టడం సరికాదని పవన్-చంద్రబాబు భేటీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీటీడీలో గదుల అద్దె విపరీతంగా పెంచుతున్నారని, పెంచిన అద్దెలను వెంటనే తగ్గించాలని విష్ణు డిమాండ్ చేశారు.
ఈ నెల 23, 24న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భీమవరంలో నిర్వహిస్తామని విష్ణు తెలిపారు. సమావేశంలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని, రెండు రాజకీయ తీర్మానం చేస్తామని వెల్లడించారు. హిందువులు, హిందు దేవాలయాలు పై దాడులు జరుగుతున్నాయని, బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. శాంతిభద్రతలకు రాష్ట్రంలో విఘాతం కలుగుతున్నాయన్నారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతారని విష్ణు విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి కి అవమానం చేయలేదా అని ప్రశ్నించారు. ప్రధాన తల్లిని విమర్శించలేదా , అమిత్ షాపై రాళ్ల దాడి చేయించలేదా అని సూటిగా ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన తర్వాత మోడీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. బీజేపీ ఓ జాతీయ పార్టీ అని, తక్కువ అంచనా వేయవద్దని కోరారు.
రాష్ట్రంలో తమ రాజకీయ ఆలోచనలు కేంద్ర పార్టీ సరైన సమయంలో అమలు చేస్తుందన్నారు.
-
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications