మైక్ లాక్కెళ్లిన దానం: సర్దార్ పటేల్‌కు నివాళి(పిక్చర్స్)
హైదరాబాద్: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 138వ జయంతిని భారతీయ జనతా పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. గన్‌పార్కు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్లు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో పటేల్‌కు నివాళులు అర్పించేందుకు అప్పటికే అక్కడికి చేరుకున్న మంత్రి దానం నాగేందర్ దత్తాత్రేయ చేతిలోని మైక్‌ను లాక్కున్నారు. దాంతో ఇరువర్గాల మధ్యకొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
సర్దార్ విగ్రహానికి పూలమాలలు వేసి బిజెపి నేతలు నివాళులు అర్పించిన అనంతరం మండలి చైర్మన్ చక్రపాణి కనిపించగా ఆయనను ఆహ్వానించి మాట్లాడమని కోరారు. అంతలో పిసిసి చీఫ్ బొత్స, దానంలు అటుగా వచ్చారు. వారు రావడంతో చక్రపాణి మధ్యలోనే ప్రసంగం ఆపేశారు. నివాళులు అర్పించిన అనంతరం దానం మైకును తీసుకెళ్లి కింద పడేశారు.

సర్దార్ 1
భారత ఉప ప్రధాని దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ 138వ జయంతిని భాజపా నాయకులు గురువారం నాడు ఘనంగా నిర్వహించారు.

సర్దార్ 2
గన్‌పార్కు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, మేచినేని కిషన్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సర్దార్ 3
భాజపా నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఇందిర 4
భారతమాజీ ప్రధాని ఇందిరాగాంధీ 29వ వర్థంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహం వద్ద చిత్రపటానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, మంత్రి దానం నాగేందర్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications