పురంధేశ్వరికి దక్కని విశాఖ: కృష్ణంరాజుకు మొండిచేయి
విశాఖపట్నం: పార్టీ మారినా దగ్గుబాటి పురంధేశ్వరికి విశాఖఫట్నం సీటు ఉత్తదే అయింది. ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు కూడా టికెట్ లభించలేదు. విశాఖ లోక్‌సభకు పార్టీ అభ్యర్థిగా కంభంపాటి హరిబాబును బిజెపి అధిష్ఠానం ఖరారు చేసింది. సీమాంధ్రలోని 3 లోక్‌సభ, 13 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ మంగళవారం రాత్రి అభ్యర్థులను ఖరారు చేసింది.
విశాఖతోపాటు నర్సాపురం, తిరుపతి లోక్‌సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. నరసాపురం సీటును రఘురామకృష్ణంరాజుకు గానీ, సినీ నటుడు కృష్ణంరాజుకు గానీ ఇస్తారని భావించినా జాబితాలో వారిద్దరి పేర్లు కూడా కనిపించలేదు.

తెలుగుదేశంతో కుదిరిన పొత్తులో భాగంగా బిజెపికి నాలుగు పార్లమెంటు సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. రాయలసీమలోని రాజంపేట లోకసభ సీటుకు మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. దీంతో రాజంపేట బిజెపి అభ్యర్థిగా పురందేశ్వరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
లోక్‌సభ అభ్యర్థులు
విశాఖపట్నం - కంభంపాటి హరిబాబు
నర్సాపురం - గోకరాజు గంగరాజు
తిరుపతి - కారుమంచి జయరాం
అసెంబ్లీ అభ్యర్థులు
తాడేపల్లిగూడెం - పి.మాణిక్యాలరావు
విజయవాడ - పశ్చిమ వెల్లంపల్లి శ్రీనివాస్
రాజమండ్రి అర్బన్ - ఆకుల సత్యనారాయణ
ఇచ్చాపురం - ఒడిసి బాలకృష్ణ
విశాఖ నార్త్ - పి.విష్ణుకుమార్ రాజు
పాడేరు - లోకుల గాంధీ
కోడుమూరు - కె.రమేశ్
కైకలూరు - కె.శ్రీనివాసరావు
నరసరావుపేట - వై. రఘునాథబాబు
సంతనూతలపాడు - దారా సాంబయ్య
మదనపల్లె - సి.నరసింహారెడ్డి
నెల్లూరు రూరల్ - ఎస్.సురేశ్‌రెడ్డి
కడప - హరినాథరెడ్డి












Click it and Unblock the Notifications