జగన్ ను రాజకీయాల్లో లేకుండా చేస్తాం- ఆదినారాయణరెడ్డి వార్నింగ్..!
ఏపీ రాజకీయాల్లో కడప రాజకీయాలే వేరు. ఇక్కడ ఏం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కడపలో ఒకప్పుడు వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత పార్టీని వీడి టీడీపీలో చేరి ప్రత్యర్ధిగా మారి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణరెడ్డి ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలను మామూళ్ల కోసం, కాంట్రాక్టుల కోసం బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ కూడా విసిరారు.
అయితే కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా వైసీపీని తెరపైకి తెచ్చిన ఆదినారాయణరెడ్డి ఇవాళ తన మాటల దాడిని మరింత పెంచారు. వైసీపీ సిమెంట్ ఫ్యాక్టరీల అరాచకాలను తాను అడ్డుకుంటున్నట్లు చెబుతున్న ఆదినారాయణరెడ్డి ఇవాళ మరోసారి ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఆయన నేరుగా వార్నింగ్ ఇచ్చారు.

వైఎస్ జగన్ ను రాజకీయాల్లో లేకుండా చేస్తామంటూ ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. సిమెంట్ పరిశ్రమల నంచి వైసీపీ నేతలు లబ్ది పొందుతున్నారని, వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందంటూ ఆది తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కంటే ఇక్కడున్న వైసీపీ వాళ్లు డేంజర్ అన్నారు.వైసీపీకి ఈసారి 11 సీట్లు కూడా రావన్నారు. జగన్ కోరికలేవీ నెరవేరవని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో కసిరెడ్డి దొరికాడని, జగన్ సహా అందరి బండారం బయటపడుతుందన్నారు. చెట్టే రాలిపోతుంటే ఇక ఆకులు, ఈకలు ఏం ఉంటాయంటూ ఆదినారాయణరెడ్డి వైసీపీపై విమర్శలు గుప్పించారు.
గత ఎన్నికల్లో బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆదినారాయణరెడ్డి జిల్లాపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో పొరుగున ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ కుటుంబానికి చెందిన ట్రక్కుల్ని కూడా అడ్డుకున్నారు. ఈ వివాదం సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లింది. దీంతో ఇరువర్గాల్ని పిలిచి రాజీ చేశారు. అయితే ఆ తర్వాత కడప జిల్లాలో సీమెంట్ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఆదినారాయణరెడ్డి చేస్తున్న రచ్చపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇదంతా వైసీపీపై పోరాటమే అంటూ ఆది చెప్పుకుంటున్నారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications