చేతకాని ప్రభుత్వం ఇంకా ఎందుకు?, అఖిలపక్షానికి రావట్లేదు: బాబుకు విష్ణుకుమార్ రాజు లేఖ..
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆయనకు లేఖ రాశారు. అఖిలపక్షానికి తాము హాజరుకావడం లేదని లేఖలో పేర్కొన్నారు.
సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు అఖిలపక్ష భేటీ పెట్టారని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. మొదట ప్యాకేజీకి మొగ్గుచూపి, ఇప్పుడేమో కేంద్రం రాష్ట్రానికేదో అన్యాయం చేసిందని గగ్గోలు పెట్టడం సరికాదన్నారు.

టీడీపీ ఎంపీల ధర్నాలు, సైకిల్ ర్యాలీలు అంతా చవకబారు ప్రచారమని విమర్శించారు. ఏపీ ప్రభుత్వాన్ని కాగ్ కడిగేసిందని, చేతకాని ప్రభుత్వం ఇంకా ఎందుకు పాలన సాగిస్తోందని ప్రశ్నించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు.
సీఎం రమేశ్ నివాసంలో టీడీపీ ఎంపీల సమావేశం:
ఢిల్లీలో హోదా పోరును ఉధృతం చేసే యోచనలో భాగంగా.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశంలో రాబోయే రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు.
కాగా, ఈరోజు ఉదయం ఎంపీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో రెండు, మూడు రోజుల్లో డిల్లీలోనే ఉండాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలపై చర్చించేందుకు ఎంపీలంతా సీఎం రమేష్ ఇంట్లో భేటీ అయ్యారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications