పవన్ కు బీజేపీ షాక్, ముద్రగడకు ట్రాప్ - ఢిల్లీ పిలుపు, పొత్తుల్లో కీలక మలుపు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తు రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, జనసేన ఇప్పటి వరకు బీజేపీ తమతో కలిసి వస్తుందని అంచనాతో ఉన్నాయి. ఈ సమయంలోనే బీజేపీ కొత్త ట్విస్టులు మొదలు పెట్టింది. ఢిల్లీకి రావాలని బీజేపీ హైకమాండ్ నుంచి పవన్ కు పిలుపు అందింది. పొత్తుల్లో ఢిల్లీ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
కొత్త సమీకరణాలు: ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. ఏపీలో జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ సమయంలోనే బీజేపీ తమతో కలిసి రావాలని కోరుకుంటున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ నుంచి దీని పైన స్పష్టత రాలేదు.

ఈ సమయంలోనే బీజేపీ ఏపీ లో కొత్త రాజకీయం ప్రారంభించింది. జనసేనతో మాత్రమే తమ పొత్తు ఉంటుందని తొలి నుంచి బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో తమ భవిష్యత్ కార్యాచరణ..వైఖరి పైన క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా పవన్ ను ఢిల్లీకి రావాలని సమాచారం ఇచ్చింది.
ముద్రగడకు ఆహ్వానం: జనసేనలో చేరేందుకు సిద్దమైన కాపు ఉద్యమ నేత ముద్రగడతో బీజేపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దీని ఫలితంగానే ముద్రగడ జనసేనలో చేరికకు బ్రేక్ పడింది. పవన్ స్వయంగా కిర్లంపూడి వెళ్లి ముద్రగడను జనసేనలోకి ఆహ్వానించాలని నిర్ణయించారు. బీజేపీ నేతలు టచ్ లోకి రావటంతో..ఈ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. జనసేనతో కలిసి ఏపీలో కొనసాగటానికి తమకు అభ్యంతరం లేదనేది బీజేపీ వాదన.

టీడీపీతో కలవటం పైనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీని పైన పవన్ తో చర్చించి..టీడీపీతో తాము కలవకపోతే జనసేనాని నిర్ణయం ఏంటనేది తెలుసుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీతో బీజేపీ కలవాలని కోరుకుంటున్న పవన్..అది సాధ్యం కాకుంటే తాను ఎవరితో ఉంటాననేది ఢిల్లీ పర్యటనలో స్పష్టం చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
ఢిల్లీకి పవన్: పవన్ దాదాపుగా టీడీపీతోనే కలిసి వెళ్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ బీజేపీ నేతలను టీడీపీతో పొత్తుకు ఒప్పించగలిగితే 2014 పొత్తుల లెక్కలు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, బీజేపీ అందుకు సిద్దంగా లేదనే సంకేతాలు అందుతున్నాయి. తెలంగాణలో బీసీ నినాదం ఓట్లుగా మారటంతో..ఏపీలో బీజేపీ కాపు సీఎం నినాదంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

దీని పైనే పవన్ తో చర్చించి.. రెండు పార్టీలు మాత్రమే కలిసి పని చేసేలా చర్చలు చేయనున్నట్లు ఢిల్లీ సమాచారం. దీంతో, ఇప్పుడు పవన్ ఢిల్లీ పర్యటనలో పొత్తుల అంశం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మూడు పార్టీల కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా..బీజేపీ ఏం తేల్చబోతోంది..పవన్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications