జగన్‌తో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి భేటీ- స్టీల్ ప్లాంట్‌పై మద్దతు- ప్రధానితో భేటీకి వస్తా
నిత్యం వివాదాలతో సావాసం చేసే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఇవాళ ఏపీలో పర్యటించారు. సీఎం జగన్‌తో భేటీ కోసం ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకున్న ఆయన మధ్యాహ్నం తాడేపల్లి వచ్చారు. జగన్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగానే భేటీ అయినట్లు సీఎంవో వర్గాలు చెబుతున్నా కీలకమైన టీడీడీ, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాలపై చర్చించేందుకే ఆయన వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయన జగన్‌తో భేటీ తర్వాత బయటికి వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరిని తప్పుబట్టారు.

జగన్‌తో సుబ్రహ్మణ్యస్వామి భేటీ
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం తాడేపల్లి వచ్చిన ఆయన సీఎం జగన్‌ను ఆన నివాసంలో కలుసుకున్నారు. స్వామిని జగన్ శాలువాతో మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం ఆయనతో కాసేపు చర్చించారు. వీరిద్దరి భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలతో పాటు టీటీడీ, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వ్యవహారాలపైనా వీరిద్దరు చర్చించినట్లు తెలిసింది.

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన స్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తప్పుబట్టారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి మద్దిస్తున్నట్లు స్వామి తెలిపారు. ప్రదాని మోడీ సీఎం జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇస్తే ఆయనతో కలిసి వెళ్తానని స్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు.

ఆంధ్రజ్యోతిలో టీటీడీ కథనాలపై పరువునష్టం దావా
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. టీటీడీ పరువుకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు.
తిరుమల స్వామి వారి ఆలయం గురించి ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు తమను కాపాడతారన్న భావనలో ఆంధ్రజ్యోతి ఉందని ఆయన విమర్శించారు.
ఆంధ్రజ్యోతి-బాబు బంధంపై విమర్శలు
ఆంధ్రజ్యోతి.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. బాబు ఓడిన తర్వాత మరోలా వ్యవహరిస్తుందని సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు లేదని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదన్నారు.. కుట్రపూరితంగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్వామి ఆరోపించారు.
ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు పరువునష్టం దావా వేశానని, తన జీవితంలో ఎప్పుడూ పరువు నష్టం దావా కేసు ఓడిపోలేదని స్వామి
-
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications