• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో హిందువులపై దాడులపై జీవీఎల్, టీజీ వెంకటేష్ ఫైర్; జగన్ సర్కార్ కు వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి సర్కారుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. టిడిపి నేతలు వైసీపీ పై దాడి చేస్తుంటే, మరోపక్క బిజెపి నేతలు సైతం జగన్ సర్కార్ పై మాటల దాడిని పెంచాయి. తాజాగా ఎంపీ టీజీ వెంకటేష్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలపై దాడులు పెరిగాయని పేర్కొన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తే బిజెపి నేతలపై కేసులు: టీజీ వెంకటేష్

ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తే బిజెపి నేతలపై కేసులు: టీజీ వెంకటేష్

ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తే బిజెపి నేతలపై కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. 80 శాతం హిందువులు ఉన్నప్పటికీ 20 శాతం ఉన్న మైనారిటీలకు రాజ్యాంగం రక్షణ కల్పించిందని పేర్కొన్న ఎంపీ టీజీ వెంకటేష్ భారతీయులంతా అన్నదమ్ముల్లా మెలగాలి అన్న విషయాన్ని మైనారిటీలకు గుర్తుచేశారు. మన దేశంలో మైనార్టీలకు ఉన్న రక్షణ ఏ దేశంలోనూ లేదని పేర్కొన్నారు. మైనారిటీ సోదరులందరు తప్పు చేయడం లేదని, మైనార్టీ లో అతి కొద్దిమంది మాత్రమే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మత ఘర్షణలు పెరిగాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్ పాలనలో దేవాలయాల మీద దాడులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

బిజెపి ఆశీర్వాదం ఉన్నందువల్లే వైసీపీ ప్రభుత్వం నిలదొక్కుకుంది: టీజీ వెంకటేష్

బిజెపి ఆశీర్వాదం ఉన్నందువల్లే వైసీపీ ప్రభుత్వం నిలదొక్కుకుంది: టీజీ వెంకటేష్


హిందువులకు న్యాయం జరగకపోతే ప్రశ్నిస్తే మతోన్మాదం అంటూ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మకూరులో తీవ్రవాద భావాలు ఉన్న కొందరు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారని టీజి వెంకటేష్ పేర్కొన్నారు. బిజెపి ఆశీర్వాదం ఉన్నందువల్లే వైసీపీ ప్రభుత్వం నిలదొక్కుకుని ఉందని, ఈ విషయాన్ని వైసిపి గుర్తుంచుకోవాలని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. హిందువులు మైనారిటీలు కలిసిమెలిసి బ్రతకాల్సిన అవసరం ఉందని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం ముగిసిందని, ఇకపై పెద్ద ఎత్తున వైసీపీ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బిజెపి లో ఉన్న ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని టి.జి.వెంకటేష్ స్పష్టం చేశారు. బీజేపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం కావాలని అన్నారు టీజీ వెంకటేష్.

పీఎఫ్ఐ సంస్థను నిర్మూలించకుంటే పార్లమెంట్ లో పోరాటం చేస్తాం : జీవీఎల్

పీఎఫ్ఐ సంస్థను నిర్మూలించకుంటే పార్లమెంట్ లో పోరాటం చేస్తాం : జీవీఎల్

ఇదిలా ఉంటే దేశంలో హిందువులకు ముప్పు రాబోతోందని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ సమాజం పై దాడులు పెరిగాయి అంటూ మండిపడ్డారు. విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహించి నిద్రలేకుండా చేసి సీఎం జగన్ ను శరణు ప్రభు అంటూ ఢిల్లీ వెళ్లేలా చేశామని ఆయన పేర్కొన్నారు. పీఎఫ్ఐ వంటి సంస్థలు ఐఎస్ఐ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని, ఈ సంస్థ ఢిల్లీలో మత ఘర్షణలను సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. పీఎఫ్ఐ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే ఉంటే ప్రభుత్వ ఏం చేస్తుందో చెప్పాలని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. పీఎఫ్ఐ సంస్థను నిర్మూలించకుంటే పార్లమెంట్లో పోరాటం చేస్తామని జగన్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

Recommended Video

Swami Paripoornananda Slams Ys Jagan.. హిందూ పండగలపై ఆంక్షలెందుకు? | Oneindia Telugu
అన్య మత సంస్థల ఆస్తులపై ఉన్న శ్రద్ధ హిందువులపై ఎందుకు లేదని జగన్ కు ప్రశ్న

అన్య మత సంస్థల ఆస్తులపై ఉన్న శ్రద్ధ హిందువులపై ఎందుకు లేదని జగన్ కు ప్రశ్న

రాష్ట్రంలో ఐదు శాతం ముస్లింలు, ఒక శాతం క్రిస్టియన్స్ ఉంటే ప్రతి వాడలో మసీదులు, చర్చిలు నిర్మిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. నరేగా నిధులతో వీటిని ఎలా నిర్మిస్తారని జివిఎల్ నరసింహారావు ప్రశ్నించారు. అన్య మత సంస్థల ఆస్తులపై ఉన్న శ్రద్ధ హిందువుల ఆస్తులపై ఎందుకు లేదని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. లవ్ జిహాద్ అంటూ అరాచకాలు సృష్టిస్తున్న పీఎఫ్ఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. మదర్సాలను మూసివేయాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.

English summary
GVL Narasimha rao and TG Venkatesh fire on attacks on Hindus in AP. He said it should not be forgotten that the YSRCP government survived with the blessings of the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X