తెలంగాణ క్రెడిట్ బీజేపీదే.. 19న మక్తల్‌లో యజ్ఞం (ఫోటోలు)

హైదరాబాద్: తెలంగాణ పోరు యాత్ర జరిగి మూడేళ్లయిన సందర్భంగా హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ ఆఫీసులో అందుకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. 1969లో ఉద్యమంలో పాల్గొన్నవారు కూడా ఈ వేదికపై ఉన్నారని, తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి ప్రబలంగా తీసుకువెళ్లడంలో బిజెపి కృషి చాలా గొప్పదని చెప్పారు.

ప్రజల ఆకాంక్షను నెరవేర్చే సంకల్పంతో మొట్టమొదట నిర్ణయం తీసుకున్న పార్టీ తమదేనని అన్నారు. కాకినాడలో తీర్మానం చేసిన మొదటి రాజకీయ పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు. 1997లో నిర్ణయం తీసుకున్నది అధికారంలోకి రావడం అనే కోరికతో కాదని, ప్రజల ఆకాంక్షను ఆనాడే గుర్తించామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష నెరవేర్చడంలో ఎంతో మంది అగ్రభాగాన నిలిచారని అన్నారు. 2002 నుండి వివిధ సందర్భాల్లో బీజేపీ స్పందించిన అన్ని ఘటనలను డాక్టర్ లక్ష్మణ్ వివరించారు. బార్‌కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో పోరుబాట నిర్వహించి తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు.

పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2012 జనవరి 19వ తేదీన మక్తల్‌లో పోరుయాత్రను ప్రారంభించిన ఘట్టం, ముగింపు సభలో తాను పాల్గొన్నానని అన్నారు. పోరుయాత్ర సందర్భంగా ఆనాటి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే తెలంగాణ ఇచ్చి తీరుతామని చెప్పడంతో ఆ క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇవ్వాలని భావించి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని అన్నారు.

 తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

తెలంగాణ పోరు యాత్ర జరిగి మూడేళ్లయిన సందర్భంగా హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ ఆఫీసులో అందుకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.

 తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. 1969లో ఉద్యమంలో పాల్గొన్నవారు కూడా ఈ వేదికపై ఉన్నారని, తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి ప్రబలంగా తీసుకువెళ్లడంలో బిజెపి కృషి చాలా గొప్పదని చెప్పారు.

 తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

ప్రజల ఆకాంక్షను నెరవేర్చే సంకల్పంతో మొట్టమొదట నిర్ణయం తీసుకున్న పార్టీ తమదేనని అన్నారు. కాకినాడలో తీర్మానం చేసిన మొదటి రాజకీయ పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు. 1997లో నిర్ణయం తీసుకున్నది అధికారంలోకి రావడం అనే కోరికతో కాదని, ప్రజల ఆకాంక్షను ఆనాడే గుర్తించామన్నారు.

 తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష నెరవేర్చడంలో ఎంతో మంది అగ్రభాగాన నిలిచారని అన్నారు. 2002 నుండి వివిధ సందర్భాల్లో బీజేపీ స్పందించిన అన్ని ఘటనలను డాక్టర్ లక్ష్మణ్ వివరించారు.

 తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

బార్‌కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో పోరుబాట నిర్వహించి తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు.

 తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2012 జనవరి 19వ తేదీన మక్తల్‌లో పోరుయాత్రను ప్రారంభించిన ఘట్టం, ముగింపు సభలో తాను పాల్గొన్నానని అన్నారు.

 తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

తెలంగాణ క్రెడిట్ బీజేపీదే

పోరుయాత్ర సందర్భంగా ఆనాటి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే తెలంగాణ ఇచ్చి తీరుతామని చెప్పడంతో ఆ క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇవ్వాలని భావించి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని అన్నారు.

1955 నుండి తాను హైదరాబాద్‌లో ఉంటున్నానని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలనే కోరిక నాయకుల్లో ఎక్కువగా ఉండేదని, అది ఎన్నో మలుపులు తిరిగి నేడు ప్రజలు అందరి ఆకాంక్షగా మారిందని చెప్పారు. పోరు యాత్ర నిర్వాహకుడు జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అనేక సిద్ధాంత వైరుధ్యాలున్నా తాము ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయామని అన్నారు.

తెలంగాణ రాదనే దశలో తాము తెలంగాణ పోరు నిర్వహించామని గుర్తుచేశారు. మూడేళ్లు పూర్తయిన సందర్భంగా 19న మక్తల్‌లో యజ్ఞం నిర్వహిస్తామని, 60 ఆకాశ జ్యోతులను విడిచిపెడతామని, సభ, రక్తదాన శిబిరం జరుగుతుందని, అక్కడ జరిగే సభలో జాతీయ నాయకులు కూడా పాల్గొంటారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+