ఈ కొర్పోరేషన్లు, మున్సిపాల్టీల కోసం బీజేపీ పట్టు - ఢిల్లీ నేతల మార్గనిర్దేశం..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. వచ్చే వారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. కూటమి తో పాటుగా వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసు కొంటున్నాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఏ పార్టీకి ఏ సీటు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. దీంతో, పార్టీ బలోపేతం కోసం ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ, జనసేన బలం గా భావిస్తున్నాయి. కమలం పార్టీ అధినాయకత్వం సైతం ఈ మేరకు పోటీ చేసే స్థానాలు.. సీట్ల పైన దిశా నిర్దేశం చేసింది. పార్టీ కోరుకునే స్థానాల పైన జాబితా సిద్దం చేస్తున్నారు.

ఏపీలో స్థానిక ఎన్నికల్లో భాగంగా ముందుగా మున్సిపల్ ఎన్నికలు ముందుగా నిర్వహించేలా రంగం సిద్దం అవుతోంది. ఈ క్రమంలో కూటమిలోని మూడు పార్టీలు సీట్ల సర్దుబాటు వ్యవహారం పైనా ఆసక్తి నెలకొంది. బీజేపీలో పొత్తులో ఉన్న సమయంలోనే పార్టీ బలోపేతం దిశగా ఢిల్లీ ముఖ్య నేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ సంస్థాగత బలోపేతానికి ఈ ఎన్నికలను ఒక అవకాశం గా తీసుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జాతీయ పెద్దలు సూచించారు. 2014- 18 తరహాలో కాకుండా గెలిచే అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టటానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో విశాఖతో పాటుగా రాజమండ్రి మేయర్ స్థానాలను తమకే కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా, మేయర్, జెడ్పీ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్ల సహా అన్ని కేటగిరీ స్థానాల్లో బీజేపీ తగిన వాటా పొందే లా ప్రణాళికను రూపొందిస్తోంది.

 శ్రీవారి సేవలో కొత్తగా వీరికీ TTD భాగస్వామ్యం - అర్హతలు, నమోదు ప్రక్రియ..!!
శ్రీవారి సేవలో కొత్తగా వీరికీ TTD భాగస్వామ్యం - అర్హతలు, నమోదు ప్రక్రియ..!!
bjp-prepares-list-of-corporations-and-municipalities-for-alliance-talks-decision-soon-here-the-l

కూటమి నేతల చర్చల వేళ

క్రిష్ణా - ఏలూరు జిల్లాల్లో ఒక జెడ్పీ ఛైర్మన్ పదవితో పాటుగా నర్సాపురం - గుంటూరు, తిరుపతి, అనంతపురం లోక సభ నియోజకవర్గాల పరిధిలో పలు మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపీపీ స్థానాలను తమకు కేటాయించేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ క్రియాశీల కంగా వ్యవహరించేందుకు వీలుగా రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో నాలుగు జోన్లుగా ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను ఖరారు చేసింది. ఈ జోన్లకు వేర్వేరు ప్రణాళికల అమలు చేయనుంది. నాలుగు జోన్లకు బాధ్యతలు పొందిన నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీ పోటీకి అనువుగా ఉన్న స్థానాలు.. అభ్యర్ధులను గుర్తించి జాబితా రూపొందించారు. నామినేటెడ్ పదవుల నియామకాల్లో ప్రాధాన్యత ఆశించిన స్థాయిలో లేదని.. దీంతో, స్థానిక ఎన్నికల్లో మాత్రం ప్రాధాన్యత దక్కే విధంగా వ్యవహరించాలని నాయకత్వం నిర్దేశించింది. ఈ మేరకు కూటమిలో తమ వాటా పైన పట్టు బట్టేందుకు బీజేపీ సిద్దం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+