స్థానిక ఎన్నికల వేళ మారుతున్న బీజేపీ లెక్కలు - ప్రధాన సీట్లపై కన్ను, ఢిల్లీ ఆపరేషన్..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతోంది. వచ్చే వారం షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కూటమి - వైసీపీ స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. కూటమి ఏకపక్షంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో కూటమిలో సీట్ల సర్ధుబాబు వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. కాగా, జనసేన తో పాటుగా బీజేపీ తాము పోటీ చేసే స్థానాల పైన పట్టు బడుతున్నాయి. ఢిల్లీ నేతల సూచనల మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమకు కావాల్సిన సీట్ల జాబితా సిద్దం చేసింది.

స్థానిక ఎన్నికల్లో జనసేనతో పాటుగా బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. తమకు ఇచ్చే సీట్ల సంఖ్య ఈ సారి ఎక్కువగా ఉండాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బలోపేతం కోసం ఈ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే విధంగా వ్యూహాలు ఉండాలని ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర నేతలకు నిర్దేశించింది. అందులో భాగంగా బీజేపీ నాయకత్వం ప్రస్తుతం పలు కార్పోరేషన్లు .. మున్సిపాల్టీల తో పాటుగా జెడ్పీల పైనా కన్నేసింది. విశాఖ, రాజమండ్రి, తిరుపతి కార్పోరేషన్లు తమకు కేటాయించాలని కోరుతోంది. బీజేపీ 1979లో కాంగ్రెస్ పార్టీతో పోటీపడి మరీ ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు జనసంఘ్ రూపంలో ఉన్న బీజేపీ.. తొలిసారి విశాఖ మేయర్‌ అభ్యర్థిని గెలిపించుకొని చరిత్ర లిఖించింది. విశాఖ గ్రేటర్ పరిధి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొంత విస్తరించి ఉంటుంది. అనకాపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్ధి గెలుపొందారు. దీంతో.. విశాఖ మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

జనసేనలోకి బొత్సా సత్యానారాయణ..? క్లారిటీ వచ్చేసింది..!!
జనసేనలోకి బొత్సా సత్యానారాయణ..? క్లారిటీ వచ్చేసింది..!!
bjp-preparing-for-local-body-elections-as-delhi-leaders-directions-demanding-key-seats-for-contesti

బీజేపీ అధినాయకత్వం దిశా నిర్దేశం

అదే విధంగా విజయవాడ, తిరుపతి నగర పాలక సంస్థలపై కూడా బీజేపీ ఫోకస్ చేసింది. ఇదే విజయవాడ సీటు కోసం జనసేన సైతం పట్టు బడుతోంది. గ్రేటర్ విశాఖ పరిధిలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే, మరో ఎంపీ ఉన్నారు. 2014లో కూడా విశాఖ ఎంపీ సీటును బీజేపీ గెలిచింది. దీంతో తమకు పట్టున్న చోట మేయర్ సీటు దక్కించుకొని.. స్థానికంగా బలోపేతం కావాలనే వారి వ్యూహం. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న బీజేపీ.. బెజవాడ మేయర్ సీటును సైతం కోరాలని డిసైడ్ అయింది. తిరుపతి మేయర్ స్థానం కూడా తమకే ఇవ్వాలని కోరేందుకు సిద్దమయ్యారు. ప్రధానంగా ఈ మూడు కార్పోరేషన్లతో పాటుగా మూడు జెడ్పీ ఛైర్మన్లు.. పదికి తగ్గకుండా మున్సిపాల్టీలు తమకు కేటాయించే విధంగా జాబితా తో కూటమి నేతల భేటీలో చర్చించాలని భావిస్తున్నారు. దీంతో.. బీజేపీ కోరుకుంటున్నట్లుగా సీట్ల కేటాయింపు ఉంటుందా .. టీడీపీ నాయకత్వం ఏం చేయబోతుందనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+