చంద్రబాబుకు ఆ ఛాన్స్ ఇవ్వం, బీజేపీ పొత్తు గేమ్ - పవన్ పై ఒత్తిడి..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవ్వటం ఖాయమని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే బీజేపీ పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు పై ఒత్తిడి పెంచుతోంది. అటు పవన్ కల్యాణ్ పైన సీట్ల విషయంలో సొంత నేతల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు.

పొత్తు లెక్కలు:టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖాయం అంటూనే మరో వైపు డైలమా కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేడర్ నుంచి ఒత్తిడి ఉండటంతో సీట్ల పైన చంద్రబాబు, పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్ల ప్రకనటకు ముహూర్తం నిర్ణయించారు. ఇంతలో పొత్తు పైన బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. దీంతో..మూడు పార్టీల సీట్ల పైన చర్చలు మొదలయ్యాయి. బీజేపీ నుంచి సీట్లు, పవర్ షేరింగ్ పైన టీడీపీ నుంచి స్పష్టత కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ, జనసేన రెండు పార్టీలకు 50 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు రెండు పార్టీలకు 6 ఎంపీ, 35 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

BJP pressure politics with TDP and Janasena as Alliance for next Elections

బీజేపీ కొత్త వ్యూహం:దీంతో, బీజేపీ నుంచి ఇంకా అంగీకారం రాలేదని సమాచారం. ఇదే సమయంలో పవన్ మధ్యవర్తిత్వానికి సిద్దమయ్యారు. కానీ, పవన్ కల్యాణ్‌కు మాత్రం బీజేపీ అధిష్టానం నుంచి అపాయింట్ మెంట్ అందడం లేదు. 2014 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా.. 2018 ఎన్నికల ముందు చంద్రబాబు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో తాము రాష్ట్రంలో నష్టపోవాల్సి వచ్చిందని బీజేపీ చెబుతోంది. దీంతో, ఈ సారి పొత్తుతో వెళ్లాంటే తమ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడేలా బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా అధికారంలోకి రావటానికి కావాల్సిన 88 సీట్లు టీడీపీకి రాకుండా..తమ సంఖ్య కూడా కలిపితేనే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటోంది. ఆ దిశగా టీడీపీ 110-120 సీట్లలోనే పోటీ చేయాలని..తమ రెండు పార్టీలకు 50-55 సీట్లు ఇవ్వాలని పట్టుబడుతోంది.

2014 పొత్తులు రిపీట్:ఈ సమయంలోనే పవన్ పైనా ఒత్తిడి పెరుగుతోంది. పవన్ కు 25-27 సీట్లు ఇస్తే అంగీకరించవద్దని 40 సీట్లు తీసుకోవాలని సొంత పార్టీ నేతలు సూచిస్తున్నారు. బీజేపీ కలిసి వస్తే 25 సీట్లకు పరిమితం అవ్వాలని పవన్ సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో బీజేపీ మద్దతు లేకుండా ఎన్నికలకు వెళ్లాలంటే చంద్రబాబు సాహసించటం లేదనేది కమలం పార్టీ నేతలు గుర్తించారు. దీంతో, తమ పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయమనే మూడ్ తీసుకురావటంలో బీజేపీ ఇప్పటికే సక్సెస్ అయింది. దీంతో, చంద్రబాబు - బీజేపీ మధ్య పొత్తును సక్సెస్ చేయటానికి మధ్యవర్తులు రంగంలోకి దిగారు. ఈ రోజు లేదా రేపు చంద్రబాబు -బీజేపీ మధ్య సీట్ల పైన కొలిక్కి వస్తే పొత్తుపైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+