తెలంగాణ కేడర్ అధికారిని కోరి తెచ్చుకున్నారు, కానీ: బాబుకు కేంద్రం ఝలక్!

అమరావతి: అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపునకు సంబంధించి ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరి తెచ్చుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సతీశ్ చంద్ర కేటాయింపునకు సంబంధించి కేంద్రం బుధవారం ఆసక్తికర వాదన వినిపించింది.

ఏపీ కేడర్‌కు సతీశ్ చంద్రను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందేనని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యూనల్ (క్యాట్)కు చెప్పింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సతీశ్ చంద్ర తెలంగాణ కేడర్‌కు కేటాయించబడ్డారు.

BJP shock to Chandrababu Naidu

అయితే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సతీశ్ చంద్ర సీఎంఓలో కీలక అధికారిగా పని చేశారు. పదేళ్ల తర్వాత మరోమారు సీఎం పీఠం దక్కించుకున్న చంద్రబాబు తన కార్యాలయంలో సతీశ్ చంద్ర ఉండాల్సిందేనని భావించారు.

ఈ క్రమంలో సతీశ్ చంద్ర ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యారు. దీనిపై నమోదైన వ్యాజ్యంపై బుధవారం క్యాట్‌లో విచారణ జరిగింది. సతీశ్ చంద్రను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం నిర్దేశిత మార్గదర్శకాలకు విరుద్ధమేనని ఈ విచారణ సందర్భంగా కేంద్రం వ్యాఖ్యానించింది. స్వాపింగ్ విధానానికి విరుద్ధంగా జరిగిన ఈ కేటాయింపును ఇతర అధికారులు తమ న్యాయపర హక్కుగా భావించరాదని కేంద్రం చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+