నంద్యాల ఉప ఎన్నిక: చంద్రబాబుకు బిజెపి ఊరట, జగన్‌కు షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: తెలుగుదేశం పార్టీకి దూరమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక విషయంలో బిజెపి కీలకమైన నిర్ణయం తీసుకుంది. కాస్తా ఆలస్యంంగానే అయినప్పటికీ ఆ నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరటనిచ్చేదే.

కాగా, బిజెపి నిర్ణయం నంద్యాల ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు షాక్ ఇచ్చేదే. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి మద్దతు తెలియజేయాలని ఎపి బిజెపి నిర్ణయం తీసుకుంది.

BJP supports TDP in Nandyal bypoll

విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి అధికారికంగా ప్రకటించింది. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోనూ టిడిపితో కలిసి పనిచేయాలని బిజెపి నిర్ణయం తీసుకుంది.

Chandrababu discussions In co ordination meeting Over strategies for Nandyal by-polls

ఆదివారం లేదా సోమవారం నుంచి నంద్యాలలో బిజెపి కార్యకర్తలు కూడా టిడిపితో కలిసి ప్రచారంలో పాల్గొంటారని బిజెపి నేతలు చెప్పారు. నంద్యాలలో ఆగస్టు 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది.బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆగస్టు చివరి వారంలో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh BJP has decided to support Telugu Desam Party (TDP) candidate Bhuma Brahmananda Reddy in Nandyal assembly bypoll.
Please Wait while comments are loading...