టిడిపితో బిజెపి సై: పవన్‌పై చర్చ, మోడీతో భేటీ వాయిదా

హైదరాబాద్/న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు బుధవారం మరోసారి చర్చించింది. సీట్ల సర్దుబాట్ల విషయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి సారించింది. ఈ మేరకు టిడిపికి కూడా సూచనలు ఇచ్చిందట. అలాగే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నినాదం పైనా చర్చించింది.

బుధవారం జరిగిన సమావేశంలో టిడిపితో పొత్తు, పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు నడిచే విషయమై చర్చించారు. పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుస్తారనే ప్రచారం జరిగినప్పటికీ మోడీ తీరిక లేకుండా ఉండటంతో అది వాయిదా పడింది. ఇవాళ లేదా రేపు పవన్ ఆయనతో భేటీ కానున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించి జనసేనకు సంకేతాలు కూడా ఇచ్చిందని సమాచారం.

BJP-TDP alliance may be firmed up soon

సీమాంధ్రలో బిజెపి నాలుగు ఎంపీ స్థానాలు, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలను కోరుతోంది. తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది ఎంపీ, 40 ఎమ్మెల్యే స్థానాలని కోరుతోంది. ఈ నెల 21న సీమాంధ్ర బిజెపి శాఖ సమావేశం కానుంది. అందులో వెంకయ్య నాయుడు పొత్తు, సీట్లు తదితర అంశాలపై మాట్లాడనున్నారు. మరోవైపు సీమాంధ్రలో త్వరలో మోడీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. వీటిలో కడప, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఉన్నాయి. ఏప్రిల్ 28 నుండి మే 5 మధ్య ఆయన రానున్నారు.

పవన్ వస్తే స్వాగతిస్తాం

పవన్ కళ్యాన్ తమతో కలిసి వస్తే స్వాగతిస్తామని బిజెపి అధికార ప్రతినిధి వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని జనసేన పిలుపునివ్వడం శుభపరిణామమన్నారు. పవన్‌తో ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+