నాటు పడవ మునక: 5గురు విద్యార్థినుల మృతదేహాలు వెలికితీత

మృతి చెందిన వారిలో నాయకం జానికి (15), నాయకం కాంతమ్మ (14) అక్కాచెల్లెలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దుర్ఘటనలో జనప కొండమ్మ (12), ముందొలి జొగోతి (10), ముందొలి లక్ష్మి (13)లు మృత్యువాతపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న నాటుపడవ కేవలం బరువు అధికమై గెడ్డలో మునిగిపోయింది.
ఒడిశాలోని మల్కానగిరి జిల్లా కాళిగుడ గ్రామానికి వీరు నాటు పడవలో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఎం.రామనాథ్, ఎం.సురేంద్ర అనే విద్యార్థులకు ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలను కాపాడుకున్నారు. అధికారులు వస్తారని ఎదురు చూసినప్పటికీ ఎవరూ రాకపోవడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు దహన సంస్కారాలను పూర్తి చేశారు.
రంగబయలు పంచాయతీ సర్పంచ్ గొల్లోరి శ్రీనివాస్, విఆర్వో కోటిబాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన చిన్నారుల వివరాలను సేకరించారు. విషయం తెలుసుకున్న పలువురు నేతలు బాధితుల కుటుంబసభ్యులను పరామర్శించారు. రూ. ఐదు లక్షల రూపాయల వంతున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
నిందితుడికి పదేళ్ళ జైలు శిక్ష
చిత్తూరు: ఐదేళ్ళ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి న్యాయమూర్తి పదేళ్ళ జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు.తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన ముబారక్ చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ హోటల్‌లో పని చేసేవాడు. అదే హోటల్లో పని చేసే ఓ మహిళ కుమార్తె(5) కిడ్నాప్ చేసిన ముబారక్ అత్యాచారం చేసి పరా రయ్యాడు. పోలీసులు ముబారక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications