Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్

ఏపీలో రోజుకో రకంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు గత టీడీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈఎస్ఐ మందుల స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోట్లు దండుకున్నారని వెలుగులోకి రావటంతో టీడీపీ హయాంలో అవినీతిపై సిట్ ఏర్పాటు చేశారు సీఎం జగన్ . ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు సీఎం జగన్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిట్‌కు చట్టబద్ధత లేదు

సిట్‌కు చట్టబద్ధత లేదు

ఇక తాజాగా బోండా ఉమా వైసీపీ పాలనపై, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. పరిపాలన చేయడం చేతగాకే వైసీపీ ప్రభుత్వం పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు బోండా ఉమామహేశ్వరరావు. ఇక తమ పరిపాలనలో ఏ తప్పూ జరగలేదని పేర్కొన్న బోండా ఉమా సీఎం జగన్ ఏర్పాటు చేసిన సిట్‌కు చట్టబద్ధత లేదన్నారు. ఒక్క ఇష్యూలో అవినీతి జరిగిందని తేలితే సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తారని బోండా ఉమా స్పష్టం చేశారు. కానీ సీఎం పాలన తుగ్లక్ పాలన కాబట్టి రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడ్డారు.

మద్యం, ఇసుక అక్రమాలపై కూడా సిట్ వెయ్యాలని డిమాండ్

మద్యం, ఇసుక అక్రమాలపై కూడా సిట్ వెయ్యాలని డిమాండ్

గత ప్రభుత్వ పాలనపై ఎన్ని విచారణలు జరిపినా తమకు అభ్యంతరం లేదు కానీ సీఎం జగన్ పాలనలో జరిగిన అవినీతిపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బోండా ఉమా. 9 నెలల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం, ఇసుక అక్రమాలపై కూడా సిట్ విచారణ జరిపించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. విశాఖలో 30వేల ఎకరాలు కొన్న జగన్‌పై సిట్‌ ఎంక్వైరీ వేయాలని ఉమా డిమాండ్ చేశారు.

రస్ ఆల్ ఖైమా కేసు నుండి దృష్టి మరల్చటానికే సిట్

రస్ ఆల్ ఖైమా కేసు నుండి దృష్టి మరల్చటానికే సిట్

ఇక పోలీసులను సొంత వ్యవహారాలకు వాడుకుంటున్నారని మండిపడిన ఉమా, ఆడవాళ్లు స్నానాలు చేస్తుంటే డీఎస్పీ డ్రోన్ కెమెరాలు తిప్పారని ముందు మండడంలో ఆ ఘటనకు పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. ఇక తనపై ఉన్న కేసుల నుండి దృష్టి మరల్చటానికి టీడీపీపై బురద చల్లుతున్నారని అన్నారు. రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మరల్చటానికే సిట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.

Recommended Video

    Union Minister Venkaiah Naidu Praises YSRCP MLA Roja - Oneindia Telugu
    కేసుల నుండి బయటపడటం కోసమే ఢిల్లీ వెళ్ళిన సీఎం జగన్

    కేసుల నుండి బయటపడటం కోసమే ఢిల్లీ వెళ్ళిన సీఎం జగన్

    ఇక అంతేకాదు జగన్‌ కేసులో ముద్దాయిలందరికీ మారిషస్‌ కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు బోండా ఉమ. ఈ కేసుల నుంచి బయట పడటం కోసమే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని సీఎం జగన్ వేడుకున్నారని ఆరోపించారు. అంతేకాదు రస్ ఆల్ ఖైమాకు రూ. 800 కోట్లు చెల్లించేందుకు సీఎం జగన్ తన ఎంపీలను ఆ దేశం పంపారని ఆరోపించారు. రస్ ఆల్ ఖైమా విషయంలో వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదడంలేదని ప్రశ్నించారు బోండా ఉమా .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+