• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

72 వేల కోట్ల హెరాయిన్ వెనుక తాడేపల్లి బిగ్ బాస్; ఏపీ మద్యంలోనూ ఆ డ్రగ్స్ : బోండా ఉమ సెన్సేషన్

|

తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ రాజకీయాలు కుదిపేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోందని, ఇక ఈ డ్రగ్స్ మాఫియా వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా సీఎం జగన్ నే టార్గెట్ చేసి మరీ ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డ్రగ్స్ వ్యవహారంలో టార్గెట్ చేసి దుమారం సృష్టించగా, ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ని టార్గెట్ చేస్తూ టిడిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

పొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకంపొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకం

 ఏపీ కేంద్రంగా డ్రగ్స్ దందా .. 72 వేల కోట్ల హెరాయిన్ వెనుక బిగ్ బాస్ ?

ఏపీ కేంద్రంగా డ్రగ్స్ దందా .. 72 వేల కోట్ల హెరాయిన్ వెనుక బిగ్ బాస్ ?

ఏపీ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా సాగుతోందని టిడిపి నేత బోండా ఉమ ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ నుండి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు అక్రమ రవాణా జరుగుతూ పట్టుబడిన హెరాయిన్ రవాణా షిప్ మెంట్ పై విజయవాడ అడ్రస్ ఉండడంతో మొదలైన రాజకీయ రచ్చ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. వైసీపీ ప్రభుత్వానికి హెరాయిన్ లింకులు ఉన్నట్లుగా టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా టిడిపి నేత బోండా ఉమ వైసిపి రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రాన్ని నేరస్తుల అడ్డాగా మార్చిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టుబడిన 72 వేల కోట్ల హెరాయిన్ వెనుక బిగ్ బాస్ ఎవరంటే వైసిపి భుజాలు తడుముకుంటోంది అని బోండా ఉమ ఆరోపణలు గుప్పించారు.

డ్రగ్స్ కేసులో వైసీపీ ఎందుకు ఉలికి పడుతుంది

డ్రగ్స్ కేసులో వైసీపీ ఎందుకు ఉలికి పడుతుంది

నిర్వాహక బిగ్ బాస్ తాడేపల్లిలో ఎక్కడున్నాడో త్వరలోనే తేలుతుందని బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ఈ డ్రగ్స్ వ్యవహారమంతా తెలుసు అని చెప్పిన బోండా ఉమా, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల కోసం పోలీసులు తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ దందా పై విచారణ జరిపించాలని డీఆర్ఐ కి లేఖ రాస్తామని బోండా ఉమ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో వైసీపీ ఎందుకు ఉలికి పడుతోందో చెప్పాలని ప్రశ్నించారు బోండా ఉమ.

 ఏపీ మద్యంలో ఆ డ్రగ్స్ వాడుతున్నారు

ఏపీ మద్యంలో ఆ డ్రగ్స్ వాడుతున్నారు

రాష్ట్రంలో మైనింగ్ మాఫియా లాగా డ్రగ్స్ మాఫియా తయారయిందని, డ్రగ్స్ సిండికేట్ అయిందని బోండా ఉమ ఆరోపించారు. పట్టుబడిన 72 వేల కోట్ల హెరాయిన్ ఏమైందని ప్రశ్నించిన బోండా ఉమ, తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి పెట్టదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న మధ్యంలో డ్రగ్స్ నే వాడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బోండా ఉమ. ఏపీలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత వెళ్ళిందో తేలాలని పేర్కొన్నారు.

మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ అందుకే .. వైసీపీకి భయం దేనికి ?

మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ అందుకే .. వైసీపీకి భయం దేనికి ?

వైసీపీ ప్రభుత్వం మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని బోండా ఉమ ఆరోపించారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారో చెప్పాలని ఉమా ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు అని, నిన్న హఠాత్తుగా మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టడం వెనుక మతలబు అదేనని బోండా ఉమా అభిప్రాయపడ్డారు. కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడడం దేశంలో ఎప్పుడూ జరగలేదని చెప్పిన బోండా ఉమా తెలుగుదేశం పార్టీ తరఫున ఢిల్లీ వెళ్లి ఏపీలో జరుగుతున్న అక్రమాలను గురించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తాడేపల్లి నుండి ఢిల్లీలో డి ఆర్ ఐ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

ముంద్రా పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కు విజయవాడ అడ్రెస్ ఉంటే వైసీపీ దందా చేస్తున్నట్టా ? పేర్ని నాని

ముంద్రా పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కు విజయవాడ అడ్రెస్ ఉంటే వైసీపీ దందా చేస్తున్నట్టా ? పేర్ని నాని


ఇక నిన్నటికి నిన్న మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. విజయవాడకు ఆఫ్ఘనిస్తాన్ హెరాయిన్ అక్రమ రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు అంటూ టిడిపి నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. తెలుగు తమ్ముళ్లు గ్రామ సింహాలకు పోటీగా గొడవ చేస్తున్నారని పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెన్నైలో స్థిరనివాసం ఉండే వ్యక్తి విజయవాడ అడ్రస్ పెట్టి డ్రగ్స్ దందా చేస్తే దీనికి వైసీపీపై ఆరోపణలు చేస్తే ఎలా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

 టీడీపీ నేతలు ఆంధ్రా తాలిబన్లు అన్న మంత్రి పేర్ని నానీ

టీడీపీ నేతలు ఆంధ్రా తాలిబన్లు అన్న మంత్రి పేర్ని నానీ


కావాలని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టిడిపి నేతలు ఆంధ్రా తాలిబన్లుగా మారి అధికార పార్టీ పై విమర్శలు గుప్పిస్తున్నారు అని, పచ్చ బ్యాచ్ ఆకు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముంద్రా పోర్ట్ లో పట్టుబడ్డ హెరాయిన్ పై విజయవాడ అడ్రస్ ఉండటం మినహాయించి ఏపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న పేర్ని నాని ఇదంతా పచ్చ గోల అంటూ తేల్చిపారేశారు. కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితుడు సుధాకర్ కు డ్రగ్స్ మూలాలు ?


ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ లోకి ప్రవేశించిన భారీ హెరాయిన్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాచవరం సుధాకర్ ఆయన భార్య వైశాలి కీలక నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే వారిని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకుని వారి నుంచి వివరాలను సేకరిస్తున్నారు. వారిస్తున్న సమాచారంతో ఢిల్లీ నుండి చెన్నై వరకు వివిధ ప్రాంతాలలో విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసులో అరెస్టైన సుధాకర్ కు డ్రగ్స్ మూలాలు ఉన్నట్లుగా దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన సుధాకర్ తన అత్తగారి ఇంటి అడ్రస్ గా చూపించి ఆషీ ట్రేడింగ్ పేరుతో జీఎస్టీ లైసెన్సు పొందినట్టు నిర్ధారించిన దర్యాప్తు అధికారులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.

English summary
TDP leader Bonda Uma targeted jagan and ysrcp in drugs case. Bonda Uma allegated that Tadepalli Bigg Boss behind Rs 72,000 crore heroin. Bonda Uma sensation that drugs are using in the ap manufacturing liquor also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X