జై జగన్.. జగనన్న మనిషి అనే కక్షసాధింపు-తేల్చేసిన బోరుగడ్డ..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు చంద్రబాబు, పవన్, లోకేష్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అప్పట్లో ఓ చర్చి కోశాధికారిని బెదిరించిన కేసులో తాజాగా అరెస్టయ్యారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు పోలీసు కస్టడీలో విచారణకు హాజరైన బోరుగడ్డను వైసీపీతో సంబంధాలపై ప్రశ్నిస్తే నోరు మెదపలేదనే వార్తలొచ్చాయి. అయితే ఇవాళ కస్టడీ ముగిశాక వైద్య పరీక్షలకు ఆస్పత్రికి తెచ్చిన సమయంలో మాత్రం ఆయన స్పందించారు.
అంతా ఫేక్, ఈ కేసుతో తనకేం సంబంధం లేదంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. సంబంధం లేని కేసులో పోలీసులు తీసుకొచ్చారని ఆరోపించారు. అంతా రాజకీయ కక్ష అన్నారు. జగనన్న మనిషని రాజకీయ కక్ష్య సాధిస్తున్నారని బోరుగడ్డ తెలిపారు. కొన్ని మీడియా ఛానళ్లు చేస్తున్న ప్రచారానికి ఎస్సీ కమిషన్ తో సమాధానం చెప్తానని బోరుగడ్డ తెలిపారు.
తాను బాగా చదువుకున్న వ్యక్తినని, దళితుడిని కూడా అని, అందుకే రాజకీయ విపక్ష అని సంచలన ఆరోపణ చేశారు.

తనపై వ్యక్తిగత హననం చేశారని, కోర్టుల ద్వారా దీనిపై పోరాడతానని బోరుగడ్డ అనిల్ కుమార్ వెల్లడించారు. అనంతరం పోలీసు వ్యాన్ లో ఎక్కించగానే జై జగన్ అంటూ బోరుగడ్డ నినాదాలు చేసారు. గతంలో వైసీపీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని బోరుగడ్డ తెలిపారు. అటు వైసీపీ కూడా బోరుగడ్డతో తమకేం సంబంధం లేదని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు బోరుగడ్డ జగన్ నినాదాలు చేయడం, జగనన్న మనిషని చెప్పుకోవడం సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications