హైకోర్టు తీర్పుపై బొత్సా సంచలనం: మూడు రాజధానులపైనా ఏపీ మంత్రి కీలకవ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు, సీఆర్డీఏ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై వైసీపీ మంత్రులు స్పందిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ క్షుణ్నంగా పరిశీలించిన తరువాత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే . ఇక తాజాగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోర్టు తీర్పుపై స్పందించారు.

సుప్రీం కోర్టుకు వెళ్ళాలా వద్దా అన్నది చర్చించాక చెప్తాం : మంత్రి బొత్సా
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా.. లేదా అనేది తాము చర్చించిన తరువాత చెబుతానని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటామని, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును కూడా ఉపసంహరించుకున్నామని, ప్రస్తుతం సీఆర్డీఏ చట్టం అమలు లోనే ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చట్టాలు చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని పేర్కొన్న ఆయన, రాజ్యాంగ స్పూర్తితోనే పార్లమెంటు, అసెంబ్లీ లు చట్టాలు చేస్తున్నాయని, అవి ఉన్నది చట్టాలు చేయడానికేనని వెల్లడించారు.

తీర్పు కాపీని పూర్తిగా అధ్యయనం చేశాకే తదుపరి నిర్ణయం
హైకోర్టు ఇచ్చిన తీర్పు లో ఏముందో తెలియదు అని తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత సాయంత్రం అన్ని విషయాలు చెబుతాను అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మూడు నెలల్లో ప్లాట్లు ఇవ్వాలంటే ఎలా ఇస్తారని పేర్కొన్న ఆయన ఏదైనా ప్రాక్టికల్ గా సాధ్యపడుతుందా లేదా అనేది చూడాలంటూ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మూడు నెలల నుండి ఆరు నెలల వరకు అని చెప్తే బాగుండేది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో హైకోర్టు తీర్పు తరువాత కూడా బొత్స సత్యనారాయణ తాము మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు.

మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామన్న బొత్సా
మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అంటూ పేర్కొన్న బొత్స సత్యనారాయణ, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. త్వరలో మూడు రాజధానులు బిల్లు పెడతామని, పరిపాలన వికేంద్రీకరణ చేయాలని, అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని తమ ప్రభుత్వం భావిస్తోందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మూడు రాజధానులు ఏర్పాటు కోసం తాము ఈ క్షణం వరకు నిబద్ధతతో ఉన్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Recommended Video

చెప్పేవాడికి చేసేవాడు లోకువ అన్నట్టు కోర్టు వ్యాఖ్యలు ఉన్నాయన్న బొత్సా
వైసీపీ ప్రభుత్వం సామాజ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటే టిడిపి తన సామాజిక అభివృద్ధి కోసం ఆలోచిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టిడిపి నేతలేమీ సాధువులు కారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. చెప్పేవాడికి చేసేవాడు లోకువ అన్నట్టు కోర్టు వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి పెదవి విరిచారు. చట్టాలను తాము రద్దు చేసుకున్న తరువాత కొత్తగా తీర్పు ఏముందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ ప్రభుత్వానికి ఏ విధమైన షాక్ కాదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications