ఇద్దరు సీఎంలను కూర్చోబెడతా: గవర్నర్‌తో కేసీఆర్ ఏకాంతంగా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులతో తాను సమావేశం ఏర్పాటు చేస్తానని గవర్నర్ నరసింహన్ గురువారం తెలిపారు. గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో గవర్నర్ దంపతులకు ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కావన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీడియా సహకరించాలని సూచించారు. ఎంసెట్ నిర్వహణ పైన ఇరు రాష్ట్రాల మంత్రులతో మాట్లాడానని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాలని సూచించినట్లు చెప్పారు.
సమస్య పరిష్కారానికి కొన్ని ఆప్షన్లు ఇచ్చానన్నారు. ఈ వ్యవహారంపై ఇరు రాష్ర్టాల మంత్రుల నుంచి నివేదిక రాలేదన్నారు. రాష్ట్రాల ప్రత్యేక హోదా తన పరిధిలోని అంశం కాదన్నారు. పోలవరం ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఆంధ్రా, తెలంగాణ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటానని, మొదట విజయవాడ, తర్వాత హైదరాబాద్‌లో రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటానని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు మంచి విజన్ ఉందని చెప్పారు.
గవర్నర్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు
గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్‌తో పాటు ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, రాజయ్య గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఏకాంతంగా సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.
కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. నలుగురు ఐఏఎస్ అధికారులను రాష్ట్రంలోనే కొనసాగించాలని కోరింది. ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, జయేష్ రంజన్, సోమేష్ కుమార్, రొనాల్డ్ రాస్‌లను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని కోరింది.












Click it and Unblock the Notifications