బొత్స అనూష పోటీ అక్కడే ? చిన్న శీనుకు చెక్- జగన్ మాస్టర్ ప్లాన్...!

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు తన మేనమామ బొత్స సత్యనారాయణతో కలిపి చక్రం తిప్పిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తాజాగా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. కుమార్తె మజ్జి సిరి సహస్ర భవిష్యత్తు కోసం ఆయన టీడీపీలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహంగా ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు వీళ్లిద్దరికీ చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషను (Botsa Anusha) సరైన చోట బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.

విజయనగరం జడ్పీ ఛైర్ రేసులో అనూష (Botsa Anusha)

బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసురాలిగా తెరపైకి తెచ్చిన కుమార్తె బొత్స అనూషను విజయనగరం జడ్పీ ఛైర్ పర్సన్ సీటు నుంచి బరిలోకి దింపాలని భావించారు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు సైతం అదే సీటులో తన కుమార్తె సిరి సహస్రను బరిలోకి దింపేందుకు సిద్దమయ్యారు. దీంతో వైఎస్సార్సీపీలో ఎలాగో ఆ అవకాశం రాదనే అంచనాకు వచ్చి టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు త్వరలో జరిగే స్ధానిక ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ను బీసీ మహిళకు కేటాయించారు. దీంతో ఈ సీటులో బొత్స అనూషను బరిలోకి దించడం ద్వారా మజ్జి శ్రీనుకు చెక్ పెట్టాలని జగన్ ప్లాన్ సిద్దం చేశారు.

Botsa Anusha in the Race for Vizianagaram ZP Chairperson as Jagan Seeks to Check Majji SrinivasaRao
జగన్ ను కలిసిన బొత్స అనూష..! మజ్జి శ్రీనుకు కౌంటర్ స్ట్రాటజీ ఖరారు..!
జగన్ ను కలిసిన బొత్స అనూష..! మజ్జి శ్రీనుకు కౌంటర్ స్ట్రాటజీ ఖరారు..!
Botsa Anusha in the Race for Vizianagaram ZP Chairperson as Jagan Seeks to Check Majji SrinivasaRao
హుటాహుటిన రాజు గారి వద్దకు మజ్జి శ్రీను..! రాజీనామా లీకుల వేళ- తేల్చేశారా ?
హుటాహుటిన రాజు గారి వద్దకు మజ్జి శ్రీను..! రాజీనామా లీకుల వేళ- తేల్చేశారా ?

టార్గెట్ చిన్న శ్రీను

బొత్స అనూషను విజయనగరం జడ్పీ ఛైర్ పర్సన్ బరిలోకి నిలబెట్టడం ద్వారా చిన్న శ్రీనుపై టార్గెట్ ఏమాత్రం మిస్ కాకూడదనే పట్టుదలతో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏ జడ్పీ పీఠం కోసమైతే చిన్న శ్రీను పార్టీ మారాడో, సరిగ్గా అదే స్థానంలో ఆయనను, ఆయన వర్గాన్ని రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాలని భావిస్తోన్న వైసీపీ నాయకత్వం.. ఆయనకు చెక్ పెట్టేందుకు బొత్స కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలో దించడమే కరెక్ట్ అని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఒకవేళ కూటమి తరఫున చిన్న శ్రీను కుమార్తె సిరిని జడ్పీ రేసులో నిలిపినా,అనూషను ఢీకొట్టడం సులువు కాదని వైసీపీ అంచనా వేస్తోంది. అటు పార్టీ పరంగా జడ్పీ పీఠాన్ని నిలబెట్టుకోవడంతో పాటు,ఇటు చిన్న శ్రీనుకు రాజకీయంగా,వ్యక్తిగతంగా గట్టి గుణపాఠం చెప్పవచ్చనే భావనలో వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+