బెంగుళూరు పబ్ ఏపీ ఐఏఎస్ వీరంగం.. సీఎం చంద్రబాబు వల్లే.. భూమన టార్గెట్!
కార్యకర్తలనే కాకుండా అధికారులను కూడా రౌడీల్లా తయారు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిదే అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ బెంగళూరు పబ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నేపధ్యంలో చంద్రబాబు టార్గెట్ అయ్యారు.
తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒక ఐఏఎస్ అధికారి పబ్‌లో తాగి తందనాలాడుతూ పోలీసు అధికారులపై దురుసుగా ప్రవర్తించడాన్ని దేశమంతా చూసింది. విచారణకు వచ్చిన పోలీసులపై దాడికి దిగడం దుర్భాషలాడటం ఐఏఎస్ అధికారి బరితెగింపునకు నిదర్శనం అన్నారు.

ఒక ఐఏఎస్ అధికారి ఇంతగా బరితెగించడానికి చంద్రబాబు ఇస్తున్న అలుసే ప్రధాన కారణం అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలు అనేవి పూర్తిగా లేకుండా పోయాయన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను దోపిడీ దొంగల్లా వదిలేసి చంద్రబాబు నాయుడు వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ఆరోపించారు. మీ దోపిడీ మీరు చేసుకోండి నా దోపిడీ నేను చేసుకుంటాను అనే రీతిలో చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు.
చంద్రబాబు తీరు వల్లే ఆదర్శంగా నిలవాల్సిన కేంద్ర సర్వీసు అధికారులు గుండాల కంటే దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పెట్టుకున్న అధికారికి తీవ్రమైన చెడ్డ పేరు ఉందని, కుప్పం మొత్తాన్ని దోపిడీ చేస్తూ ఆ అధికారి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కుప్పంలో జరుగుతున్న దోపిడీలో వాటాను లోకేష్‌కు పంపుతున్నారనే ప్రచారం స్థానికంగా అందరికీ తెలుసన్నారు.
కుడ పీడీకి సీఎంవోలో చక్రం తిప్పుతున్న మరో అధికారి ప్రద్యుమ్న పూర్తి అండదండలు ఉన్నాయని, అవినీతిలో భాగస్వామ్యం ఉండటం వల్లే వీరు రాజకీయ నాయకులపై కూడా లెక్కలేనితనం ప్రదర్శిస్తున్నారన్నారు. అధికారులను అవినీతి వైపు మళ్లించి వారిని రౌడీలుగా మార్చిన పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే అన్నారు. దేశంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు వెనుక ఉన్నారనే ధైర్యంతోనే వికాస్ మర్మత్ పక్క రాష్ట్రానికి వెళ్లి దాడి చేశారన్నారు.
పర్సంటేజీల్లో వాటాలు పంచుకుంటూ సాగిస్తున్న తతంగం వల్లే ఈ అధికారికి ఇంత బరితెగింపు వచ్చింది. ఐఏఎస్ అధికారి ముసుగులో ఉన్న సంఘవిద్రోహ శక్తులను సీఎం పెంచి పోషిస్తూ కీలక పోస్టింగులు ఇస్తున్నారన్నారు. పబ్‌లో ఇతర కస్టమర్లపై పోలీసులపై దాడి చేసినందుకే బెంగళూరులో వికాస్ మర్మత్‌పై కేసు నమోదైందని భూమన పేర్కొన్నారు.
చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఒత్తిడి తెచ్చినా కూడా బెంగళూరు పోలీసులు కేసు బుక్ చేశారన్నారు. వీకెండ్ వస్తే అధికారులతో పాటు మంత్రులు కూడా పబ్‌లలో గడపడం అలవాటుగా మారిపోయిందన్నారు. ప్రజల సొమ్మును దోపిడీ చేసి ఇలాంటి అసాంఘిక వికృత చేష్టలకు ఖర్చు చేయడం అత్యంత దారుణం అని అభిప్రాయపడ్డారు.













Click it and Unblock the Notifications
