చంద్రబాబుకు ఏపీలో పర్మినెంట్ అడ్రెస్ ఉందా? లోకేష్ పైనా మంత్రి బొత్సా విమర్శలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్ర సాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టిడిపి హయాంలో ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

అసలు చంద్రబాబు ఆంధ్రావారా ? తెలంగాణ వారా?: ప్రశ్నించిన బొత్సా
మే 26 నుండి 29 వరకు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపిన బొత్స సత్యనారాయణ జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేశారని, సముచిత స్థానం కల్పించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం జరిగేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసలు చంద్రబాబు ఆంధ్రావారా ? తెలంగాణ వారా? అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేష్ బీసీలకు ఇది చేశామని ఒక్కటైనా చెప్పగలరా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్మినెంట్ అడ్రస్ లేని వ్యక్తి చంద్రబాబు అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇక లోకేష్ కి తెలిసింది తక్కువ మాట్లాడేది ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ బీసీలకు ఇది చేశామని ఒక్కటైనా చెప్పగలరా? అంటూ బొత్ససత్యనారాయణ నిలదీశారు . తెలంగాణలో ఉత్తరాంధ్ర కులాల బిసి కేటగిరీ కోసం తమ ప్రయత్నం చేశామని, కానీ పని జరగలేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తమ కులాన్ని సైతం బీసీ కేటగిరీ నుంచి తీసి వేశారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానం ఆ విధంగా ఉందని ఆరోపించిన బొత్స సత్యనారాయణ, ఏపీ ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి తప్పక బుద్ధి చెబుతారన్నారు.

కేంద్రం పైనా బొత్సా ఫైర్
ఇక కేంద్రం పై విరుచుకుపడ్డ బొత్స సత్యనారాయణ పెట్రోల్ ధరలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. 2019 నాటి పెట్రోల్ ధరలు ఇప్పుడు పెట్రోల్ ధరలు ప్రజలు పోల్చి చూడాలని, 40 శాతం రేట్లు పెంచి రెండు శాతం తగ్గించి ఊకదంపుడు ప్రచారం చేసుకుంటున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో 70 శాతం క్యాబినెట్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించామని, ఇక నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం బీసీలకు స్థానం ఇచ్చామని బొత్సా సత్యన్నారాయణ పేర్కొన్నారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతికేసులో ఎమ్మెల్సీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం
అంతే కాదు డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ పై కేసు పెట్టమని ఈ కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో ఎమ్మెల్సీ బయట తిరిగి ఉండవచ్చని వ్యాఖ్యానించిన బొత్ససత్యనారాయణ తప్పు చేస్తే ఎవరూ చట్టానికి చుట్టాలు కాదంటూ వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కు దశాబ్దాలుగా ఎన్నికలు జరగలేదని ఎన్నికలను కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయి అంటూ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications