అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగులను రెచ్చగొడుతుంది చంద్రబాబే, అమరావతి ప్రజలు జగన్ వైపే : బొత్సా సత్యన్నారాయణ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతున్న పరిస్థితులలో,వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారని,ఎంతోమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారని,వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది టిడిపి.

అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంతా కష్టపడి ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని, వారికి వర్క్ ఫ్రం హోం విధానం సాధ్యం కాదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

టిడిపి నాయకులు అనవసరంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు అంటూ ఆగ్రహం

టిడిపి నాయకులు అనవసరంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు అంటూ ఆగ్రహం

టిడిపి నాయకులు అనవసరంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు అంటూ మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సాధ్యపడదని, చంద్రబాబు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడుతున్నారు.సాఫ్ట్ వేర్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రం హోం విధానం సాధ్యమవుతుంది కానీ ప్రభుత్వ ఉద్యోగులకు అలా ఎలా సాధ్యమవుతుంది అంటూ బొత్ససత్యనారాయణ ప్రశ్నిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో పట్టం కట్టి ప్రజలు మూడు రాజధానులకు మద్దతు

స్థానిక ఎన్నికల్లో పట్టం కట్టి ప్రజలు మూడు రాజధానులకు మద్దతు

ఇదిలా ఉంటే రాజధాని అమరావతి విషయంలో కూడా స్పందించిన బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం చేసిందని, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలంతా అంగీకరించారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజలు ఆమోదించారు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కి పట్టం కట్టారన్నారు. అమరావతి ప్రాంత రైతులు జగన్ వైపే ఉన్నారన్నారు.

Recommended Video

Vijaysai Reddy MP అయ్యి ఉండి ఇలా మాట్లాడటం బాలేదు - నెటిజన్లు || Oneindia Telugu
టీడీపీ అధినేత చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం

టీడీపీ అధినేత చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే జగన్ సర్కార్ విధానమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన బొత్స, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల అమరావతిలో ప్లాట్ల అభివృద్ధి ఆలస్యమవుతోంది అంటూ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఉద్యోగుల్ని రెచ్చగొడుతుంది కూడా చంద్రబాబేనంటూ ఆరోపణలు గుప్పించారు మంత్రి బొత్ససత్యనారాయణ.

English summary
Botsa Satyanarayana is incensed that work from home is not possible for government employees because of the need to work at the field level and that Chandrababu is provoking employees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X