జగన్ వస్తున్నాడనే బాబు పర్యటన
వైసిపి నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు ఇంకా దాని నుంచి బయట రాలేదన్నారు. జగన్ వస్తున్నాడని తెలిసే చంద్రబాబు హడావుడిగా పర్యటించటారన్నారు. వరదలను అవకాశంగా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి రైతుల, బాధితుల పొట్ట కొట్టవద్దన్నారు.












Click it and Unblock the Notifications