బాలుడి నిర్బంధం, కాళ్లకు సంకెళ్లు: మరో బాలుడి వద్ద బుల్లెట్లు
హైదరాబాద్: దొంగతనం కేసులో అనుమానం రావడంతో ఓ బాలుడిని పోలీసులు కాళ్లకు సంకెళ్లు వేసి నిర్బంధించారు. కస్టడీలోకి తీసుకుని లాకప్‌వో వేశారు. కోల్‌కతాకు చెందిన ఓ బాలుడు తన సోదరుడితో కలిసి హైదరాబాదుకు వలస వచ్చాడు. బాలుడి సోదరుడు చాంద్రాయణగుట్టలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని సాక్షి మీడియా ప్రచురించింది.
ఆ వార్తాకథనంతో పాటు కాళ్లకు సంకెళ్లు వేసి ఉన్న బాలుడి చిత్రాన్ని కూడా ప్రచురించింది. ఆ మీడియా కథనం ప్రకారం - వీళ్లిద్దరూ కలిసి సెల్‌ఫోన్లు దొంగిలించారన్నది పోలీసుల అభియోగం. కొన్ని ఫోన్లను కూడా బాలుడి వద్ద స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. సెల్‌ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ ఆరా తీస్తున్నామని తెలిపారు.

ఆరో తరగతి విద్యార్థి స్కూలుకు బుల్లెట్లు తీసుకువచ్చి కలకలం సృష్టించాడు. వీటిని తోటి విద్యార్థులకు పంచుతుండగా, క్లాస్ టీచర్ గమనించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఓ పాఠశాలలో జరిగింది.
కాగా ఈ విషయాలను వెల్లడించేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించారు. అంతేగాక అక్కడికొచ్చిన మీడియా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. మీడియా ఈ ఘటనను డీఎస్పీ సరిత దృష్టికి తీసుకెళ్లింది. స్కూలుకు బుల్లెట్లు తీసుకువచ్చిన విద్యార్థి తండ్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒక విద్యార్థి మరణించాడు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడ్డారు. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications