ప్రేయసిని గొడ్డలితో నరికి చంపిన ఉన్మాది, బాలికపై రేప్

బాలయ్య కూతురు అనిత(16) కల్వకుర్తిలో ఇంటర్ చదువుతోంది. తన స్వగ్రామానికి చెందిన తిరుపతయ్య అనే యువకుడితో ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటామంటూ కుటుంబసభ్యులకు చెప్పారు. దాంతో మైనార్టీ తీరకుండా పెళ్లి చేసుకోవడం నేరమని అమ్మాయి తల్లిదండ్రులు నచ్చ చెప్పారు. దీంతో వారి పెళ్లి ఆగిపోయింది. అనిత శుక్రవారం వ్యవసాయ పొలంలో కూలీ పని చేయడానికి వెళ్లింది.
సాయంత్రం అక్కడికి వచ్చిన తిరుపతయ్య ఆమెతో ఘర్షణ పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతపెట్టాడు. ఇందుకు అనిత అంగీకరించలేదు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఆమెనుకిరాతకంగా నరికిచంపి పరారయ్యాడు.మరో
ఘటనలో నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) మం డలం రహీంఖాన్‌పేటలో ఓ కామాంధుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. గురువారం పాఠశాల వదిలిన తర్వాత వినాయకుడి మండపం వద్ద తోటి పిల్లలతో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల విద్యార్థినికి పెన్నులు కొనిస్తానని ఆశ చూపి పాఠశాలలో స్వీపర్‌గాపని చేస్తున్న మహ్మద్ బందెల్లి(70) తన ఇంటికి తీసుకెళ్లాడు.
బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications