విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమికులపై దాడులు స్వేచ్ఛను హరించడమే: బృందా

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రేమికుల రోజు జంటలకు పెళ్లి చేస్తామని హిందూ మత సంస్థలు హెచ్చరించడాన్ని సిపిఎం నాయకురాలు బృందా కారత్ తప్పు పట్టారు. వాలంటైన్‌డే రోజున ప్రేమికులపై దాడులు చేయడమంటే వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆమె వ్యాఖ్యానించారు.

నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మహిళలకు ధైర్యం వచ్చినా కూడా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వర్మ కమిటీ సూచనలను పట్టించుకోవటం లేదని ఆమె ఆరోపించారు. సిపిఎంను ఏ పార్టీలోనూ విలీనం చేసేది లేదని ఆమె స్పష్టం చేశారు.

Brinda Karat opposes hindu organisations statements

విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆమె గురువారంనాడు 21వ సిపిఎం అఖిల భాత వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, హుధుద్ తుఫాను సాయం విషయంలో తమ పార్టీ సీరియస్‌గా ఉందని బృందా కారత్ చెప్పారు.

ప్రభుత్వాలు హామీలతోనే సరిపెట్టుకుంటున్నాయని ఆమె విమర్శించారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాలను చర్చకు తెస్తామని ఆమె చెప్పారు.

English summary
CPM leader Brinda Karat opposed Hindu organization warnings to the lovers in the eve of valentines day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X