హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపై విమర్శించబోయి..తమాయించుకున్న పవన్ కల్యాణ్
హైదరాబాద్/అమరావతి: హ్యూమన్ ట్రాఫికర్లు అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. ఈ విషయంలో అటు పవన్ కల్యాణ్ కూడా వెనకడుగు వేయట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు కొన్ని రోజుల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించినప్పటికీ- అటు పవన్ కల్యాణ్ గానీ, జనసేన పార్టీ గానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. వలంటీర్ల వ్యవస్థపై తమ దాడిని కంటిన్యూ చేస్తోన్నారు.
వలంటీర్లు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా గతంలో ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.

ఈ వ్యవహారం న్యాయస్థానానికి కూడా చేరిన విషయం తెలిసిందే. ఓ మహిళా వలంటీర్.. పవన్ కల్యాణ్‌పై పరువునష్టం దావా సైతం వేశారు. విజయవాడ సిటీ మెట్రో పాలిటన్ కోర్టులో ఈ పిటీషన్ దాఖలైంది. దీన్ని- న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. లక్షలాది మంది వలంటీర్లను పవన్ కల్యాణ్ అవమానించారని పిటీషనర్ ఆరోపించారు.
ఈ వివాదం అటు కొనసాగుతుండగానే- పవన్ కల్యాణ్ ఈ సారి ఏపీలో రోడ్ల దుస్థితిపై సెటైర్లు వేశారు. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారాయన. ఏపీ రోడ్ల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఉన్న రోడ్లు అక్కడి (ఏపీ)రోడ్లలా కాదు.. అంటూ వ్యాఖ్యానించారు.
హీరో సాయి ధరమ్ తేజ్ ఇదివరకు నెక్లెస్ రోడ్‌లో బైక్‌పై వెళ్తూ జారి పడ్డ విషయంపై మాట్లాడే సమయంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరో రోడ్డుపై ఇసుక వేస్తే.. బైక్‌పై వెళ్తూ సాయి ధరమ్ జారిపడ్డాడని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. రోడ్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా? అని తెలంగాణలోని రోడ్ల గురించి మాట్లాడబోయి మాట మార్చారు.

హైదరాబాద్‌లో రోడ్లు బాగున్నాయని, అక్కడి రోడ్ల గురించి తాను మాట్లాడట్లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. రోడ్లను క్లీన్ చేస్తే సరిపోతుందని సూచించారు. సాయి ధరమ్ తేజ్ రోడ్డు మీద పడిపోతే అభిమానులే స్పందించి ఆయనకు సహాయం అందించారని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మీద పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడంటూ సెటైర్లు సంధిస్తోన్నారు.
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ బ్రో. సముద్రఖని దర్శకుడు. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్ ఇది. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications