వరద సమయంలోనూ ఇదేం దరిద్రం..విజయవాడలో మనిషికి రూ.5 వేలు వసూలు (వీడియో)
రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. రెండు, మూడు రోజులుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగాయి. చాలా ప్రాంతాల్లో వరద నీళ్లు ఇళ్లలోకి చేరాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ఊళ్లపై విరుచుకుపడ్డాయి. పలుచోట్ల రోడ్లపై వాగులు ఉధృతంగా ప్రవహించాయి. రాష్ట్రం వ్యాప్తంగా చాలా ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యారు. ఈ వరదల్లో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపారు.
మరో ముగ్గురు వరద నీటిలో గల్లంతయ్యారని పేర్కొన్నారు.ముఖ్యంగా విజయవాడ చరిత్రలో ఎప్పుడు చూడని వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉదృతిని ఎప్పుడు చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడం మొత్తం కూడా జలమయంగా మారింది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి.రెండు రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శనివారం నుంచి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. ప్రభుత్వం అందిస్తోన్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. అయితే ఇదే అదునుగా కొందరు దందాకు తెరలేపారు. విజయవాడలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అయితే అవి ఏమాత్రం సరిపోకపోవడంతో దళారులు తమ దందాను మొదలుపెట్టారు. ప్రజల భయాన్ని తమ పెట్టుబడిగా మార్చుకున్నారు. జలదిగ్బదంలో ఉన్న ప్రజలను ఒడ్డుకు చేర్చినందుకు మనిషికి రూ. 5 వేల రూపాయిలు వసూలు చేస్తున్నారు.అటు ప్రజలు కూడా ప్రాణాలు కన్నా డబ్బులు ఎక్కువ కాదని ఆ డబ్బులు చెల్లించి ప్రాణాలతో సురక్షితంగా బయటపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications