సోదరికి వేధింపు: బావ కాళ్లు, చేతులు నరికారు
ఒంగోలు/శ్రీకాకుళం: మద్యానికి బానిసై సోదరిని వేధిస్తున్న బావను చెట్టుకు కట్టేసి కాళ్లూ, చేతులు నరికిన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అతన్ని ఆ బావమరుదులు అక్కడే వదిలేసి పరారయ్యారు. జిల్లా గుడ్లూరు మండలంలో ఆదివారం జరిగింది.
పూరేటిపల్లికి చెందిన వెంకటమ్మ, సింగరాయకొండకు చెందిన అంజయ్య దంపతులు. అంజయ్య ఐదురోజుల క్రితం భార్య వెంకటమ్మను కొట్టి పుట్టింటికి పంపాడు. మద్యం మత్తులో ఆదివారం తెల్లవారుజున అత్తవారింటికి వచ్చిన అంజయ్య భార్యను మళ్లీ దుర్భాషలాడుతుండటంతో ఆమె సోదరులపాటు మరో ఇద్దరు అంజయ్యను పట్టుకుని అక్కడే ఉన్న చెట్టుకు కట్టేశారు.

ఆ తర్వాత కత్తితో కాళ్లు, చేతులు నరికారు. దీంతో అంజయ్య ఒక కాలు మోకాలి కింద భాగం వరకు తెగిపోగా, చెయ్యి కూడా తెగిపోయి వేలాడుతోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో అంజయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
పోలీసులు బాధితుడు అంజయ్య నెల్లూరు జిల్లా కావలి వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. అంజయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను వేధిస్తుండటం వల్లనే తన అన్నదమ్ములు అంజయ్యపై దాడి చేశారని భార్య పోలీసులకు తెలిపింది.
తిరుమలలో దళారీ అరెస్టు
ప్రజాప్రతినిధుల లెటర్‌హెడ్‌ల కలర్ జిరాక్స్‌లు తీసి టీటీడీ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ వసతి, దర్శన సౌకర్యాలు పొందుతు భక్తులను, టీటీడీని మోసం చేస్తున్న తిరుపతికి చెందిన మోహన్‌రెడ్డి అనే దళారీని విజిలెన్స్ అధికారులు ఆదివారం అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు.
నిందితుడి వద్ద కాకినాడ ఎంపి తోట నరసింహంకు చెందిన లెటర్ హెడ్, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు చెందిన రెండు లెటర్‌హెడ్‌లు గుర్తించారు. ఆదివారం రిసెప్షన్ అధికారి ఝన్సీరాణి సంతకాన్ని ఫోర్జరీ చేసి పద్మావతి అతిథిగృహంలో వసతి పొందడానికి ప్రయత్నించాడు. అక్కడున్న సిబ్బంది మోహన్ రెడ్డిని అనుమానించి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications