ఛీ! మీకే ఈ పరిస్థితి వస్తే: కేసీఆర్‌కు గుత్తా, బాబు వచ్చేందుకు రెడీ: గంటా
దరాబాద్: నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు ఆయన సోదరుడు జితేందర్ రెడ్డి తెరాసలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.
గతంలో ఎన్నికల సమయంలోనే ఫిరాయింపులు ఉండేవని, ఇప్పుడు సర్వసాధారణంగా మారాయని మండిపడ్డారు. సొంత పార్టీలోనే ఇలాంటి పరిస్థితి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేస్తుందని గుత్తా తెరాసను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించారు.
రాజకీయాలొద్దు: గంటా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి చెందిన ఫైళ్లు, రికార్డులు అప్పగిస్తామని చెప్పిన తెలంగాణ సర్కారు మాట తప్పిందని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విమర్శించారు. పాలిసెట్ ఫలితాల విడుదల సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఉన్నత విద్యా మండలి ఫైళ్లు, రికార్డులు ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వాటిని ఇవ్వలేదని చెప్పారు. ఏదేమైనా ఈ నెల 12 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
పాఠశాలల ప్రారంభమయ్యే నాటికి డీఎస్సీ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గంటా సూచించారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి సమస్యల పైన చంద్రబాబు స్వయంగా వచ్చి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications