వైఎస్ జగన్ కు షాకిచ్చిన కేసీఆర్?

భారత రాష్ట్ర సమితి కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ఏపీలో ఆ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. తాజాగా ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాష్ట్రంలో అమరావతి, మూడు రాజధానులంటూ వివాదం నెలకొన్న తరుణంలో మీ పార్టీ ఒక రాజధానికి మద్దతిస్తుందా? మూడు రాజధానులకు మద్దతిస్తుందా? అని తోటను అడిగారు. ప్రజలంతా ఎక్కువమంది అమరావతిలోనే రాజధాని ఉండాలనుకుంటున్నారని, తమ పార్టీ అభిప్రాయం కూడా అదేనని స్పష్టం చేశారు.

 అమరావతికే మొగ్గుచూపుతున్న కేసీఆర్

అమరావతికే మొగ్గుచూపుతున్న కేసీఆర్

వాస్తవానికి పార్టీ నిర్ణయం అదేనంటూ బహిరంగంగా చెప్పారంటే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అమరావతికే మొగ్గుచూపుతున్నట్లు అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. మొదటి నుంచి ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తున్నారు. కొన్ని విషయాల్లో మాత్రం భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని విషయంలో మాత్రం అమరావతికే మొగ్గుచూపడంద్వారా వైసీపీ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించినట్లు అర్థమవుతోంది.

బీఆర్ఎస్ ద్వారా ఏపీలోకి అడుగు

బీఆర్ఎస్ ద్వారా ఏపీలోకి అడుగు

జాతీయ పార్టీ ద్వారా ఏపీలోకి అడుగుపెట్టబోతున్న భారత రాష్ట్ర సమితి లక్ష్యం తెలుగుదేశం, జనసేన ఓట్లు చీల్చి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడమేనని ఇప్పటికే పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం, జనసేనతోపాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ.. తదితర పార్టీలన్నీ అమరావతి రాజధానికే మద్దతు పలుకుతున్నాయి. వైసీపీ మాత్రం కర్నూలు, విశాఖ, అమరావతి మూడు రాజధానులుగా ప్రతిపాదన చేసింది. దీనిపై ఆ పార్టీకి ఏ పార్టీ నుంచి మద్దతు రాలేదు. ఉమ్మడి రాష్ట్రం విభజనకు గురైన తర్వాత అనేక సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయాయి.

జాతీయ కోణంలో ఏపీ సమస్యలను చూస్తే..

జాతీయ కోణంలో ఏపీ సమస్యలను చూస్తే..

వీటితోపాటు ఏపీకి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాకానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, పోలవరం ప్రాజెక్టు.. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు.. లాంటివన్నింటిపై కేసీఆర్ అభిప్రాయం ఏమిటనేది స్పష్టత రావడంలేదు. తెలంగాణ వైపు నుంచి చూస్తే ఈ ప్రాజెక్టులన్నీ వస్తే తెలంగాణ కన్నా ఏపీ ముందు వరుసలో నిలబడటానికి ఆస్కారం ఉంది. అలాకాకుండా జాతీయ పార్టీ నేతగా చూస్తే ఒక రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే కేవలం తెలుగుదేశం, జనసేన ఓటుబ్యాంకును చీల్చడం కోసమే రాష్ట్రంలో అడుగుపెడుతున్నారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+