గుంటూరులో దారుణం: ఒంటిపై పెట్రోలు పోసి నిప్పటించేశారు..
సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
గుంటూరు: గుంటూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. సోమవారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకోగా.. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.

బాధితుడిని ఆటోనగర్‌కు చెందిన సాయిరెడ్డి అనే యువకుడిగా గుర్తించారు. దుండగుడుల దాడిలో తీవ్రంగా గాయపడి రోడ్డుపక్కన పడి ఉన్న సాయిరెడ్డిని మొదట స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయడంతో.. ఘటనా స్థలాన్ని పరిశీలించి సాయిరెడ్డిని జీజీహెచ్ కు తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిరెడ్డి మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.












Click it and Unblock the Notifications