Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ బంద్: మద్దతుగా ప్లకార్డుతో జగన్, గుండుతో ఎమ్మెల్యే, నిరసనలో జనసేన, కాంగ్రెస్

Recommended Video

    AP Bandh Update : Bandh Going Strong But Peaceful

    అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సరైన కేటాయింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర బంద్‌ చేపట్టాయి. దీనికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

    గురువారం ఉదయం నుంచే వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాయి. పలు ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాగా, తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం నిరసనకారులు మినహాయింపునిచ్చారు. గుంటూరు, విశాఖపట్నంలలో బంద్ సంపూర్ణంగా సాగుతోంది. విశాఖ ఏజెన్సీలో బుధవారం సాయంత్రం 6గంటల వరకు 144సెక్షన్ విధించారు.

    - కేంద్రం వైఖరికి నిరసనగా గుండుగీయించుకుని ఆందోళనలో పాల్గొన్నారు పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్.

    నిరసనకారులు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

    ప్లకార్డుతో జగన్

     Budget protest: Left calls for AP bandh Feb 8th

    బంద్‌కు సంఘీభావంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ బుధవారం ప్రజాసంకల్పయాత్ర నిలిపివేశారు. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్‌పేట మండలం దుండిగం క్రాస్‌ జోలగుంటపల్లి శివారు వద్ద బంద్‌లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్లకార్డులు పట్టుకుని బంద్‌కు సంఘీభావం తెలిపారు.

    విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ప్రభుత్వం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. టీడీపీ నేతలు కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసన శాంతియుత ర్యాలీలు చేపడుతున్నారు.

    కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కూడా గురువారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ రాజకీయపక్షాలు తలపెట్టిన బంద్‌కు మద్దతిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ బుధవారమే ప్రకటించారు.

    ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా పాల్గొనాలని కార్యకర్తలను ఆయన కోరారు. బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కాగా, బంద్ విషయమై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డీజీపీ మాలకొండయ్యతో సమావేశమయ్యారు.

    పలు అంశాలతో పాటు బంద్‌ సందర్భంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించారు. పోలీసులు కూడలి ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిరసనలు శాంతియుతంగా చేసుకోవాలని, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించేలా వ్యవహరించకూడదని నిరసనకారులకు డీజీపీ స్పష్టం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+