బస్సు ప్రమాదం: డ్రైవర్ సజీవదహనం (పిక్చర్స్)
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సజీవదహనమైన సంఘటన బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదం ఉదయం 3.28 నిమిషాలకు చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇంజమూరు నుండి నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు బయలుదేరిన ఆర్మూరు డిపో బస్సు ఈ తెల్లవారుజామున ఉదయం మూడు గంటల సమయంలో జేబీఎస్ చేరుకుంది.
అక్కడి వరకు బస్సు నడిపిన మధు అనే డ్రైవర్ మరో డ్రైవర్ గంగాధర్‌కు బస్సును అప్పగించాడు. ఆర్మూరుకు చెందిన కొందరు ప్రయాణీకులు బస్సు ఎక్కారు. దాదాపు 55-60 మంది వరకు ఉన్న ప్రయాణీకులతో బస్సు ఆర్మూర్‌కు బయలుదేరింది.
బోయినపల్లిలోని శ్రీలత గార్డెన్ సమీపంలో ఉన్న మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా ఓ డీసీఎం వేగంగా వస్తూ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణీకులు అద్దాలు పగులగొట్టి బస్సులోంచి కిందకు దూకారు. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ గంగాధర్ సజీవ దహనమయ్యాడు.
ప్రమాద సమయంలో అటుగా వస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన వేణు ప్రయాణీకులను అప్రమత్తం చేసి బస్సులోంచి ప్రయాణీకులను కిందకు దిగేందుకు సహాయపడ్డాడు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని గాంధీ ఆసుపత్రికి, తార్నాక ఆర్టీసి ఆసుపత్రికి తరలించారు. కాగా, సజీవ దహనమైన డ్రైవర్ అరుపులు అక్కడున్న వారిని కలచివేశాయి.

బస్సు ప్రమాదం
హైదరాబాదు బోయినపల్లిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సజీవదహనమయ్యాడు. మంటలను ఆర్పుతున్న దృశ్యం.

బస్సు ప్రమాదం
ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సజీవదహనమైన సంఘటన బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

బస్సు ప్రమాదం
ఈ ప్రమాదం ఉదయం 3.28 నిమిషాలకు చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇంజమూరు నుండి నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు బయలుదేరిన ఆర్మూరు డిపో బస్సు ఈ తెల్లవారుజామున ఉదయం మూడు గంటల సమయంలో జేబీఎస్ చేరుకుంది.

బస్సు ప్రమాదం
అక్కడి వరకు బస్సు నడిపిన మధు అనే డ్రైవర్ మరో డ్రైవర్ గంగాధర్‌కు బస్సును అప్పగించాడు. ఆర్మూరుకు చెందిన కొందరు ప్రయాణీకులు బస్సు ఎక్కారు. దాదాపు 55-60 మంది వరకు ఉన్న ప్రయాణీకులతో బస్సు ఆర్మూర్‌కు బయలుదేరింది.

బస్సు ప్రమాదం
బోయినపల్లిలోని శ్రీలత గార్డెన్ సమీపంలో ఉన్న మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా ఓ డీసీఎం వేగంగా వస్తూ బస్సును ఢీకొట్టింది.

బస్సు ప్రమాదం
దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణీకులు అద్దాలు పగులగొట్టి బస్సులోంచి కిందకు దూకారు. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ గంగాధర్ సజీవ దహనమయ్యాడు.

బస్సు ప్రమాదం
ప్రమాద సమయంలో అటుగా వస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన వేణు ప్రయాణీకులను అప్రమత్తం చేసి బస్సులోంచి ప్రయాణీకులను కిందకు దిగేందుకు సహాయపడ్డాడు.

బస్సు ప్రమాదం
తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని గాంధీ ఆసుపత్రికి, తార్నాక ఆర్టీసి ఆసుపత్రికి తరలించారు. కాగా, సజీవ దహనమైన డ్రైవర్ అరుపులు అక్కడున్న వారిని కలచివేశాయి.

బస్సు ప్రమాదం
హైదరాబాదు బోయినపల్లిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ప్రమాదస్థలంలో పరిశీలిస్తున్న దృశ్యం.

బస్సు ప్రమాదం
హైదరాబాదు బోయినపల్లిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బస్సు ప్రమాదం
హైదరాబాదు బోయినపల్లిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒకరు సజీవదహనమయ్యాడు.

బస్సు ప్రమాదం
ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సజీవదహనమైన సంఘటన బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

బస్సు ప్రమాదం
హైదరాబాదు బోయినపల్లిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒకరు సజీవదహనమయ్యాడు.












Click it and Unblock the Notifications