కాకమ్మ కథలొద్దు, సీమ బిడ్డవా.. సిగ్గుచేటు: బాబుపై దుమ్మెత్తిపోసిన బైరెడ్డి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను రాయలసీమ బిడ్డనే అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మంగళవారం నాడు... చంద్రబాబు పైన దుమ్మెత్తి పోశారు.
చంద్రబాబు శ్రీభాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించారని, 120 జివో అమలు చేసి రాయలసీమ విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా చేశారని, అలాంటి చంద్రబాబు ఇప్పుడు నేను రాయలసీమ బిడ్డనేనని, ప్రాణం ఉన్నంత వరకు సీమకు అన్యాయం జరగనివ్వనని చెప్పడం విడ్డూరమన్నారు.

రాయలసీమకు జరిగిన అన్యాయం పైన తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. రాయలసీమ వాసులకు కావాల్సింది చంద్రబాబు కాకమ్మ కథలు కాదని, సాగునీరు అని చెప్పారు.
సంఘ విద్రోహుల గుండెల్లో నిద్రపోవాలి: చంద్రబాబు
సంఘ విద్రోహుల గుండెల్లో పోలీసులు నిద్రపోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో అన్నారు. మంగళవారం విభజన తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న తొలి బ్యాచ్ ఎస్సైలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications